Naga Chaitanya: చైతన్య దూకుడు మాములుగా లేదు..!

Advertisement

అక్కినేని నాగ చైతన్య త్వరలో ‘లవ్ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. మరోపక్క విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘థాంక్యూ’ మూవీకి సంబంధించి తన పార్ట్ షూటింగ్ ను కూడా ఫినిష్ చేసాడు చైతన్య. అంతేకాకుండా ఆమిర్ ఖాన్ మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’ లో కూడా తన పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేసాడు.

అలాగే అతని తండ్రి ‘కింగ్’ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సోగ్గాడే చిన్ని నాయన’ సీక్వెల్ ‘బంగార్రాజు’ లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు మరో ట్యాలెంటెడ్ దర్శకుడికి కూడా అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. వివరాల్లోకి…ఈ ఏడాది ‘నాంది’ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్ కనకమేడల. ఆ మూవీతో ప్లాపుల్లో సతమతమవుతున్న అల్లరి నరేష్ కు హిట్ ఇచ్చి.. గట్టెక్కించాడు.

ఇతను ఇటీవల నాగ చైతన్యకి కూడా ఓ కథ వినిపించాడట. అది చైతన్యకి ఎంతగానో నచ్చేయడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ అధినేతలు సాహు గురపాటి, హరీష్ పెద్ది లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది నుండీ షూటింగ్ ప్రారంభం కానుంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus