ఆ సంతోషం మాటల్లో వర్ణించలేనిది.. ఆస్కార్ అవార్డుపై ప్రేమ్ రక్షిత్ కామెంట్స్!

  • March 15, 2023 / 08:20 PM IST

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో ప్రతి ఒక్కరు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆస్కార్ కోసం అమెరికా వెళ్లినటువంటి చిత్ర బృందం ఒక్కొక్కరిగా తిరిగే ఇండియాకు వస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ఉదయం తెల్లవారుజామున ఎన్టీఆర్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ హైదరాబాద్ చేరుకున్నారు. ఇలా హైదరాబాదులోకి అడుగుపెట్టగానే కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తాను కొరియోగ్రఫీ చేసినటువంటి పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఈ అవార్డు గురించి ప్రేమ్ రక్షిత్ మాట్లాడుతూ.. తాను ఆస్కార్ వేడుకలకు వెళ్తానని అసలు ఊహించుకోలేదు. ఆర్ఆర్ఆర్ టీం సపోర్టుతోనే తాను అమెరికా వెళ్లానని తెలిపారు. అక్కడికి వెళ్ళగానే తాను ముందుగా ఈ పాట రిహార్సల్స్ లో పాల్గొన్నానని తెలిపారు. అయితే ఆస్కార్ వేడుకల రోజు తాను కొరియోగ్రఫీ చేసిన పాట ఆస్కార్ వేదికపై పెర్ఫార్మెన్స్ చేయడంపూర్తయి అయిన తర్వాత అక్కడున్న వారందరూ లేచి చప్పట్లు కొట్టడంతో ఒక్కసారిగా తనకు కన్నీళ్లు ఆగలేదని తెలిపారు.

ఇక అవార్డు తీసుకున్న తర్వాత సంగీత దర్శకుడు కీరవాణి తనను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఆ క్షణం నేను పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేనని ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తాను కొరియోగ్రఫీ అందించిన పాటకు గొప్ప అవార్డు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు ఆస్కార్ అవార్డు రావడం ఎంతో అసాధ్యం అనుకుంటున్న తరుణంలో రాజమౌళి దానిని సుసాధ్యం చేసి చూపించారు.ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది అంటే అందులో రాజమౌళి తపన కృషి ఎంతో ఉందని చెప్పాలి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus