టాలీవుడ్‌లో మళ్లీ ఫుల్ ఫోకస్‌తో దూసుకెళ్లేందుకు సిద్ధమవుతున్న హీరోయిన్ నభా నటేష్ ప్లానింగ్ చూస్తే నిజంగానే షాక్ అవ్వాల్సిందే. మోడలింగ్ నుంచి సినిమాల వరకూ స్టెప్ బై స్టెప్ ఎదిగిన ముద్దుగుమ్మ నభా, ఇప్పుడు తన కెరీర్‌లో కీలకమైన దశలో ఉంది. 2015లో కన్నడ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, తెలుగులో ‘నన్ను దోచుకుందువటే’ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్లో కీలక పాత్ర పోషించి మంచి పాపులారిటీని దక్కించుకుంది.
అయితే ఒక ప్రమాదం కారణంగా కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన నభా, ఇప్పుడు మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్‌పై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఆమె చేతిలో ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి స్వయంభు, మరొకటి నాగబంధం. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో, సమ్మర్ టార్గెట్‌గా విడుదలకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అధికారిక రిలీజ్ డేట్స్ ఇంకా ప్రకటించకపోయినా, మేకర్స్ ప్రమోషన్స్ మాత్రం ఇప్పటికే స్టార్ట్ చేశారు.
స్వయంభులో నభా ఒక రాజకుమారి తరహా పాత్రలో కనిపించనుండగా, నాగబంధంలో పార్వతి అనే డిఫరెంట్ షేడ్ ఉన్న క్యారెక్టర్‌లో నటిస్తోంది. రెండు సినిమాల టీజర్లకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే, ఈ పాత్రలు నభా కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది.
ఇక సోషల్ మీడియాలో కూడా నభా చాలా యాక్టివ్‌గా ఉంది. ఒకవైపు గ్లామర్ ఫోటోషూట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటూనే, మరోవైపు తన సినిమా క్యారెక్టర్ల లుక్స్‌ను రివీల్ చేస్తూ హైప్ పెంచుతోంది. ఈ సమ్మర్ తనకు టర్నింగ్ పాయింట్ కావాలనే పట్టుదలతో ఉన్న నభా నటేష్, ఈ రెండు సినిమాల ఫలితాలపై పూర్తి నమ్మకంతో ఉంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.