ఆ ఒక్క విషయంలో నాగఅశ్విన్ ఎందుకు తప్పు చేశాడు.!

ఇవాళ ఉదయం విడుదలైన “మహానటి” సినిమా మోడ్రన్ క్లాసిక్ అంటూ అందరూ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఇక నటిగా కీర్తి సురేష్, దర్శకుడిగా నాగఅశ్విన్ లను మెచ్చుకొంటున్న తీరైతే మన సీనియర్ డైరెక్టర్స్ అండ్ హీరోయిన్స్ అయితే.. కుళ్లుకునే స్థాయిలో ఉంది. కానీ.. అందరూ ఈ స్థాయిలో మెచ్చుకొంటున్న “మహానటి”లో ఓ మిస్టేక్ ఉందని తెలిసింది. అది కూడా తీసిపారేయదగ్గ తప్పు కాదని.. చాలా పెద్ద మిస్టేక్ అని చెబుతున్నారు సావిత్రి జీవితం గురించి పూర్తి స్థాయిలో తెలిసిన సినిమా పెద్దలు, పాత్రికేయులు.

“మహానటి” చిత్రంలో సావిత్రి ఆస్తులు కోల్పోయి పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు పోషిస్తున్న పోషిస్తూ కాలం నెట్టుకొస్తున్న తరుణంలో.. ఒకానొక సినిమా షూటింగ్ ముగించుకొని రిటర్న్ అవుతున్న తరుణంలో ఆమెను పిలిచి మరీ భోజనం పెడతాడు గుమ్మడి వెంకటేశ్వర్రావు. కానీ.. “మహానటి” సినిమాలో సావిత్రికి అలా పిలిచి భోజనం పెట్టేది ఎస్వీ రంగారావు అన్నట్లుగా తెరకెక్కించాడు నాగఅశ్విన్. సావిత్రి జీవితంలోని చీకటి కోణాల్ని, ఎవరికీ తెలియని చాలా విషయాల గురించి ఎంతో పరిశోధించిన నాగఅశ్విన్, అందరికీ తెలిసిన ఈ విషయంలో తప్పెలా చేశాడంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఎస్వీఆర్ 1975లోనే చనిపోయారు. అలాంటిది 1980లో ఆయన బ్రతికున్నట్లుగా చూపించడం అనేది చారిత్రక తప్పిదం అనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus