Nag Ashwin: ఆ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్న నాగ్ అశ్విన్.. ఏం చేశారంటే?

  • July 31, 2023 / 02:14 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ మార్కెట్ గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో పెరిగింది. అయితే బాహుబలి2 సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో విజయాలను సొంతం చేసుకోలేదు. ప్రభాస్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండగా ప్రభాస్ సక్సెస్ రేట్ మాత్రం తగ్గుతుండటం గమనార్హం. అయితే ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ప్రాజెక్ట్ కే వర్కింగ్ టైటిల్ కాగా కల్కీ 2898 ఏడీ అనే టైటిల్ ను అధికారికంగా ప్రకటించడం జరిగింది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విషయంలో నెగిటివ్ కామెంట్లు వినిపించగా గ్లింప్స్ విషయంలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నాగ్ అశ్విన్ ఈ సినిమాతో ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ సినిమా గ్లింప్స్ విషయంలో వచ్చిన రివ్యూలను సైతం పరిగణనలోకి తీసుకుని నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమా మరింత స్పెషల్ మూవీగా నిలిచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాకు సంబంధించి జరిగిన పొరపాట్లు ఈ సినిమా విషయంలో తప్పులు జరగకుండా నాగ్ అశ్విన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రాజెక్ట్ కే సినిమా 2024 సంవత్సరం మే నెల 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ తేదీకి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

దాదాపుగా 700 నుంచి 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సీక్వెల్ లేదని నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కే బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో ప్రాజెక్ట్ కే సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus