జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) త్వరలో షూటింగ్ లతో మరింత బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) మూవీ షూట్ ఈ నెల చివరి వారంలో మొదలుకానుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలైతే అభిమానులు సైతం సంతోషించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే నాగబాబు (Naga Babu) ఒక సందర్భంలో పవన్ కు ఇష్టమైన ఫుడ్ వివరాలను వెల్లడించారు. ఆంధ్రా ఫుడ్ అంటే పవన్ కళ్యాణ్ కు ఎంతో ఇష్టమని పలావును పవన్ ఎంతో ఇష్టంగా తింటారని సమాచారం.
కొంతమంది ఈ వంటకాన్ని పులావ్ అని కూడా పిలుస్తారు. పలావు ఉంటే పవన్ కళ్యాణ్ సాధారణంగా తినే మొత్తం కంటే ఎక్కువగా తింటారని తెలుస్తోంది. పవన్ కు ఇష్టమైన వంటకం గురించి తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతూ ఉండటం గమనార్హం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూటింగ్స్ తో బిజీ అయితే వేగంగా అన్ని సినిమాలను పూర్తి చేసే అవకాశాలు ఉంటాయి. ఓజీ (OG Movie) , హరిహర వీరమల్లు 2025 ఫస్టాఫ్ లో అయినా రిలీజ్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఆయన సినిమాల షూట్స్ పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన సినిమాలకు 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ 2025 సంవత్సరంలో ఎన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.
ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాకు మాత్రం ఎక్కువ సంఖ్యలో డేట్లు అవసరం అయిన నేపథ్యంలో ఆ సినిమాకు పవన్ ఎప్పుడు డేట్లు కేటాయిస్తారనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది. పవన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.