Devara: ఆ నగరంలో ఎన్టీఆర్ మాస్ కటౌట్.. తారక్ రేంజ్ నెక్స్ట్ లెవెల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR)  దేవర (Devara) సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతానని నమ్మకంతో ఉన్నారు. ఆర్.ఆర్.ఆర్ (RRR) సినిమాతో వచ్చిన క్రేజ్ కూడా తనకు ప్లస్ అవుతుందని తారక్ బలంగా విశ్వసిస్తున్నారు. అయితే ముంబైలో ఉన్న సముద్రంలో దేవర కటౌట్ ఏర్పాటు చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ వేరే లెవెల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ముంబైలో నగరంలోని దాదర్ చౌపట్ బీచ్ వద్ద ఉన్న సముద్రంలో ఈ మాస్ కటౌట్ ను ఏర్పాటు చేశారు.

Devara

ఈ విధంగా కటౌట్ ను ఏర్పాటు చేయడం ద్వారా దేవరపై ఇతర రాష్ట్రాల్లో సైతం అంచనాలు పెరుగుతున్నాయి. మూడు గంటల నిడివి వార్తలు ఒకింత టెన్షన్ పెడుతున్నా కంటెంట్ అద్భుతంగా ఉంటే ఆ నిడివి వల్ల సమస్య ఉండదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముంబైలో సైతం తారక్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర నార్త్ బెల్ట్ లో కలెక్షన్ల విషయంలో అదరగొడుతుందేమో చూడాలి.

దేవర హిట్టైతే వార్2, తారక్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమాలు సైతం కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయని యంగ్ టైగర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర కన్నడ, మలయాళ, తమిళ వెర్షన్లకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.

దేవర బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఏ రేంజ్ లో లాభాలను అందిస్తుందో అనే చర్చ సైతం జరుగుతోంది. కంటెంట్ అద్భుతంగా ఉంటే మాత్రం దేవర క్రియేట్ చేసే సంచలనాలు మాత్రం మామూలుగా ఉండవని చెప్పవచ్చు. రికార్డుల విషయంలో మాత్రం దేవర అదరగొడుతోందనే చెప్పాలి.

ఆ వెర్షన్ డబ్బింగ్ ను 4 గంటల్లో పూర్తి చేసిన తారక్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus