యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాకు ఏకంగా 45 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడం జరిగింది. అయితే దేవర (Devara) సినిమాకు తారక్ పారితోషికం భారీ స్థాయిలో పెరిగిందని వార్తలు వినిపించినా తారక్ మాత్రం 60 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కు కూడా భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో లాభాల్లో కొంతమేర తారక్ కు వాటాగా దక్కే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) విలన్ రోల్ లో నటిస్తుండగా సైఫ్ రెమ్యునరేషన్ మాత్రం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ సినిమాకు 3.5 కోట్ల రెమ్యునరేషన్ అందుకోగా ఆమె హోటల్, ట్రావెలింగ్, ఇతర ఖర్చులకు మరో కోటి రూపాయలు ఖర్చు అయిందని భోగట్టా. శ్రీకాంత్ (Srikanth) ఈ సినిమా కొరకు అరకోటి అందుకున్నారని తెలుస్తోంది.
ప్రకాష్ రాజ్ (Prakash Raj) కోటిన్నర రూపాయలు అందుకోగా మిగతా నటీనటులు పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది. దేవర సినిమా రిలీజ్ కు 11 రోజుల సమయం మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే. దేవర సినిమాకు బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడం ప్లస్ కానుంది. తమిళ సినిమా సత్యం సుందరం విడుదలవుతున్నా ఆ మూవీ దేవరకు పోటీ ఇచ్చే ఛాన్స్ అయితే లేదు.
ఈ సినిమాకు దేవర మూవీకి పోటీ అని కూడా ఎవరూ భావించడం లేదనే సంగతి తెలిసిందే. దేవర సినిమా బిజినెస్ కు సత్యం సుందరం బిజినెస్ కు ఏ మాత్రం పొంతన ఉండదని చెప్పవచ్చు. దేవర సినిమా వల్ల సత్యం సుందరం సినిమా కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంది. దేవర కంటెంట్ మీద మేకర్స్ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. రాజమౌళి (S. S. Rajamouli) సెంటిమెంట్ ను ఈ సినిమా బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.