Esha Deol: అబ్బాయిలు చేసే అతిపెద్ద తప్పు ఇదే.. ఈషా డియోల్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటి హేమా మాలిని (Hema Malini) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి కూతురు, హీరోయిన్ ఈషా డియోల్ (Esha Deol) కు సైతం ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. ఈషా డియోల్ 2012 సంవత్సరంలో భరత్ తక్తానీని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు రాధ్య, మిరాయ పేర్లతో ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే ఈషా డియోల్ కు భర్తతో మనస్పర్ధలు రావడం వల్ల ఆమె విడాకులు తీసుకోవడం జరిగింది.

Esha Deol

అయితే విడాకుల తర్వాత కొంతకాలం పాటు సైలెంట్ గా ఉన్న ఈ బ్యూటీ తాజాగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈషా డియోల్ మాట్లాడుతూ రిలేషన్ షిప్ లో మీ భాగస్వామితో సమానంగా ఉండాలని ఇద్దరి లైఫ్ స్టైల్ ఒకే విధంగా ఉండాలని ఆ విషయంలో తేడా వస్తే మాత్రం మీ బంధంలో ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. అబ్బాయిలకు మంచి తోడు దొరికినా వేరే వాళ్లపై మనసు పారేసుకుంటారని ఇది తప్పు అని ఆమె వెల్లడించారు.

మంచి రిలేషన్ లో ఉండాలంటే స్నేహం ఉండాల్సిందేనని అప్పుడు నువ్వు ఏం చేసినా అవతలి వాళ్ల అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదని ఈషా డియోల్ పేర్కొన్నారు. నా విషయానికి వస్తే నా ప్రపంచం నాదని నేను ఒక్కదాన్నే రోజంతా సరదాగా గడిపేయగలనని ఆమె చెప్పుకొచ్చారు. అలా ఉండటం నాకెంతో ఇష్టమని నాలాంటి వారికి ఆ పర్సనల్ స్పేస్ ఇవ్వాలని ఈషా డియోల్ కామెంట్లు చేశారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఈషా డియోల్ నటించారు. ఈషా డియోల్ వయస్సు ప్రస్తుతం 42 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. ఈషా డియోల్ (Esha Deol) రెమ్యునరేషన్ కూడా పరిమితంగానే ఉండగా ఆమె కెరీర్ పరంగా ఎదగడంతో పాటు మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈషా డియోల్ చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయని సమాచారం అందుతోంది.

 నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో.. ఆప్యాయత కనబరిచిన తారక్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus