Jr NTR Video Call: నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో.. ఆప్యాయత కనబరిచిన తారక్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) అభిమాని అయిన కౌశిక్ క్యాన్సర్ తో బాధ పడుతూ దేవర సినిమా చూడాలని తన కోరిక అని ఆ సినిమా విడుదలయ్యే వరకు తనను బ్రతికించాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయం అభిమానుల ద్వారా తారక్ దృష్టికి వచ్చింది. వీడియో కాల్ ద్వారా కౌశిక్ తో మాట్లాడిన ఎన్టీఆర్ కౌశిక్ కు ధైర్యం చెప్పారు.

Jr NTR

కౌశిక్ ధైర్యంగా కోలుకుని బయటకు రావాలని దేవర సినిమా చూడాలని సినిమా అనేది నెక్స్ట్ అని మొదట కౌశిక్ కోలుకుంటే చాలు అని తారక్ కామెంట్లు చేశారు. కౌశిక్ తల్లీదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలంటూ తారక్ ఆప్యాయత కనబరిచారు. నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని సంతోషానికి కారణమయ్యారు. తారక్ మాట్లాడటంతో కౌశిక్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

“అన్నా.. మిమ్మల్ని చూస్తానని అస్సలు అనుకోలేదు” అంటూ కౌశిక్ తారక్ ను చూస్తూ కామెంట్లు చేశారు. తారక్ వీడియో కాల్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. నందమూరి ఫ్యాన్స్ ట్విట్టర్ పేజీ ద్వారా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అభిమానులను కుటుంబ సభ్యులతో సమానంగా తారక్ చూసుకుంటారనే సంగతి తెలిసిందే.

కౌశిక్ కు మనో ధైర్యం చెప్పిన తారక్ ను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. కౌశిక్ గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. కౌశిక్ వైద్యానికి 60 లక్షల రూపాయలు అవసరమని వైద్యులు చెప్పారని కౌశిక్ తల్లి వెల్లడించారు. దేవర సినిమా రిలీజ్ కు మరో 12 రోజుల సమయం మాత్రమే ఉండగా బిజినెస్ పరంగా అదరగొట్టిన దేవర కలెక్షన్ల పరంగా కూడా అదరగొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ గ్రేట్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

 

ఆ ఐదుగురి కెరీర్లను డిసైడ్ చేయనున్న దేవర.. ఎవరెవరంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus