నాగార్జున గురించి ఆసక్తికర విషయం చెప్పిన నాగ చైతన్య

అక్కినేని నాగార్జున తన పిల్లలతో స్నేహితుల్లా ఉంటారు. వారి అభిరుచులను గౌరవిస్తారు. అందుకే నాగచైతన్య సమంతని ప్రేమిస్తున్నాని చెప్పిన వెంటనే సంతోషంగా పెళ్లి జరిపించారు. అలాగే తన తనయుల సినిమా కెరీర్ హిట్ ట్రాక్ ఎక్కేవరకు తాను సినిమాలు చేయకుండా కథలపై దృష్టి పెట్టారు. ఇప్పుడిప్పుడే తన సినిమాలపై కాన్సంట్రేషన్ పెట్టారు. నాగచైతన్య సవ్యసాచి మూవీ పూర్తి చేసినప్పటికీ అందుకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువరోజులు అవసరం కావడంతో మారుతి దర్శకత్వంలో చేసిన ‘శైలజారెడ్డి అల్లుడు’ మూవీని ముందుగా రిలీజ్ చేయబోతున్నారు.

రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. ఎస్.రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా రెండు రోజుల్లో థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికపై అభిమానులతో చైతూ ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పారు. “దేవదాస్” చిత్రంలో నాగార్జున స్టిల్ ఒకటి పోస్ట్ చేసిన నాగ్ అభిమాని ఈ పిక్ గురించి ఒక్కమాట చెప్పమని అని చైతన్యను అడిగాడు. దీనికి చైతూ ఇలా స్పందించారు. ‘‘రోజురోజుకీ ఆయన వయస్సు తగ్గిపోతోంది. అదే నాకు పెద్ద సమస్య’’ అని నాగ చైతన్య సమాధానం ఇచ్చారు. అతని సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus