హ్యాట్రిక్… ఈ పదం స్పోర్ట్స్ లో మాత్రమే కాదు.. సినిమాల విషయాల్లో కూడా ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ఆ హీరో హ్యాట్రిక్ హిట్లు.. హీరోయిన్ పలానా హీరోతో హ్యాట్రిక్ హిట్లు అందుకుంది అంటూ మనం తరచూ వింటూనే వస్తున్నాం. ప్రతీ సినిమా హిట్ అవ్వాలి అనే ప్రతీ ఒక్కరూ సినిమాలు చేస్తూ ఉంటారు.ముఖ్యంగా వరుసగా మూడు హిట్లు కొట్టాలి అనే కోరిక మాత్రం ప్రతీ హీరోకి ఎక్కువ శాతం ఉంటుంది. మన అక్కినేని వారసుడు చైతన్యకు కూడా ఈ కోరిక బలంగానే ఉందట.
క్లాస్ ఆడియన్స్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో చైతన్య కు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే రెండు సార్లు హ్యాట్రిక్ మిస్సయ్యాడు చైతూ. ‘జోష్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చైతన్యకు… ఆ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందించలేదు. అయితే ఆ తరువాత ‘ఏమాయ చేసావే’ ‘100% లవ్’ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాడు. తరువాత ‘దడ’ సినిమాతో హ్యాట్రిక్ హిట్లు అందుకుంటాడు అనుకుంటే.. అలా జరగలేదు. ‘దడ’ సినిమా ప్లాప్ అయ్యింది.
ఇక అటు తరువాత ‘తడాఖా’ ‘మనం’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాక… ‘ఆటోనగర్ సూర్య’ చిత్రంతో హిట్టు కొడతాడు అనుకుంటే.. అది కూడా ప్లాపయ్యి .. హ్యాట్రిక్ మిస్ అయ్యేలా చేసింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఛాన్స్ వచ్చింది. గతేడాది ‘మజిలీ’ ‘వెంకీ మామ’ చిత్రాలతో వరుసగా రెండు హిట్లు కొట్టాడు. ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ‘లవ్ స్టోరీ’ చేస్తున్నాడు. ఈ చిత్రంతో అయినా హిట్టు కొట్టి.. హ్యాట్రిక్ సాధిస్తాడేమో చూడాలి.