Naga Chaitanya: నాగ చైతన్య.. గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

అక్కినేని నాగ చైతన్య.. నాగార్జున తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుని సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను సాగిస్తున్నాడు. ‘ఏమాయ చేసావే’ ‘100% లవ్’ ‘తడాకా’ ‘ప్రేమమ్’ వంటి సినిమాలతో నటుడిగా కూడా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు నాగ చైతన్య. అయితే నాగ చైతన్యకి హిట్ ఇచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం లవ్ స్టోరీలే ఉండగా…’మనం’ ‘వెంకీ మామ’ ‘బంగార్రాజు’ వంటి మూడు మల్టీస్టారర్లు కూడా ఉండటం గమనార్హం.అయితే చైతన్య యాక్షన్ సినిమాలు చేసిన ప్రతిసారి ఫలితం అనుకూలంగా రాలేదు. అయినప్పటికీ రిజల్ట్ తో సంబంధం లేకుండా ‘నటుడు అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి’ అనే ఉద్దేశం మీద యాక్షన్ సినిమాలు కూడా చేస్తున్నాడు నాగ చైతన్య. ఇతను నటించిన లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’ కూడా కంప్లీట్ యాక్షన్ మూవీ. వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.

అయితే ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్ కు రావడం మళ్ళీ తగ్గించారు. చైతన్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు ఇచ్చిన సందర్భాలు ఎక్కువే ఉన్నాయి. ఈ క్రమంలో (Naga Chaitanya) నాగ చైతన్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

1) సాహసం శ్వాసగా సాగిపో :

నాగచైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ‘ఏమాయ చేసావే’ తర్వాత వచ్చిన ఈ సినిమా డిమోనిటైజేషన్ టైంలో రిలీజ్ అవ్వడం వల్ల.. ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. రూ.15 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఆ టైంలో రూ.8.5 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

2) రారండోయ్ వేడుక చూద్దాం :

నాగ చైతన్య హీరోగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ.21.68 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.27.19 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.

3) యుద్ధం శరణం :

నాగ చైతన్య హీరోగా కృష్ణ మారిముతు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ.16 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.9 కోట్ల షేర్ ను రాబట్టి పరాజయం పాలైంది.

4) శైలజారెడ్డి అల్లుడు :

నాగ చైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.24 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.20 కోట్ల షేర్ ను రాబట్టి యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

5) సవ్య సాచి :

నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.21 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.10 కోట్ల షేర్ ను రాబట్టి పరాజయం పాలైంది.

6) మజిలీ :

నాగ చైతన్య హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.22 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.34.6 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

7) వెంకీ మామ :

వెంకటేష్ తో కలిసి నాగ చైతన్య నటించిన ఈ మూవీని బాబీ డైరెక్ట్ చేశాడు. రూ.32 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.40 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.

8) లవ్ స్టోరీ :

నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.32 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.35 కోట్ల షేర్ ను రాబట్టింది. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తర్వాత రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఇక థియేటర్ కు రారు అనుకున్న ప్రేక్షకులను థియేటర్ కు తీసుకొచ్చింది. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి.

9) బంగార్రాజు :

నాగార్జున తో కలిసి నాగ చైతన్య నటించిన ఈ మూవీకి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ వంటి బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ గా ఈ మూవీ రూపొందింది. 2022 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ రూ.39 కోట్ల టార్గెట్ తో బరిలోకి ఫుల్ రన్లో రూ.40 కోట్ల షేర్ ను రాబట్టి హిట్ మూవీగా నిలిచింది.

10) థాంక్యూ :

నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.24 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగి ఫుల్ రన్లో రూ.4.68 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి పరాజయం పాలైంది. ఎడతెగకుండా కురిసిన వర్షాల కారణంగా.. ఆ ఎఫెక్ట్ ఈ మూవీ కలెక్షన్ల పై పడింది. అందువల్ల ఓపెనింగ్స్ దారుణంగా దెబ్బతిన్నాయి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus