Naga Chaitanya, Samantha: సహనం కోల్పోయిన నాగచైతన్య.. ‘ఇంకా ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతారు’!

Ad not loaded.

సమంత (Samantha) – నాగ చైతన్య (Naga Chaitanya)  విడిపోయి 4 ఏళ్ళు అవుతుంది. అయినా వాళ్ళ విడాకుల గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. నాగ చైతన్య వేరే పెళ్లి చేసుకున్నా.. సమంతతో విడాకుల వ్యవహారం గురించి ఎక్కువ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తవానికి నాగ చైతన్య ఈ విషయాలపై స్పందించడానికి ఇష్టపడడు. పలు సందర్భాల్లో సమంత పరోక్షంగా ఏదోదో మాట్లాడుతూ.. అక్కినేని అభిమానులకి చురకలు అంటిస్తూ ఉంటుంది.

Naga Chaitanya, Samantha

కానీ నాగ చైతన్య చాలా కూల్ గా ఇలాంటి విషయాలను లైట్ తీసుకుంటూ ఉంటాడు. ఈ విషయంపై ప్రశ్నలు ఎదురైనా.. మెచ్యూర్డ్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. కానీ ఎందుకో ఈసారి సహనం కోల్పోయాడు.ఇటీవల నాగ చైతన్య పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై యాంకర్ ప్రశ్నించడం జరిగింది. దీంతో నాగ చైతన్యకి కోపం వచ్చినట్లు ఉంది.

అప్పుడు నాగ చైతన్య మాట్లాడుతూ.. “మా రిలేషన్ అనేది చాలా రెస్పెక్ట్ ఫుల్ గా ముగిసింది. ఇద్దరూ కెరీర్లో ముందుకు వెళ్ళాలి అని భావించి ఆ నిర్ణయం తీసుకున్నాం. తను హ్యాపీగా ఉంది. నాకు కూడా లవ్ దొరికింది. నేను కూడా హ్యాపీగా ఉన్నాను.మా పనుల్లో మేము బిజీగా ఉన్నాం. మా నిర్ణయాన్ని మీడియా అర్థం చేసుకుంటుంది. గౌరవిస్తుంది అని ఆశించాను.

కానీ నేను అనుకున్నట్టుగా జరగలేదు. మా విడాకుల వ్యవహారం అనేది అందరికీ ఓ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అయిపోయింది. నేను ఎక్కడికి వెళ్లినా గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. నేను స్పందిస్తే దీనిపై మళ్ళీ ఆర్టికల్స్, వీడియోలు వస్తాయి. అది ఎక్కడికో వెళ్తుంది. దీనికి ఫుల్ స్టాప్ ఎవరు పెట్టాలి. మీడియానే పెడితే బాగుంటుంది” అంటూ తన భావోద్వేగాన్ని బయటపెట్టాడు.

2వ రోజు కూడా కుమ్మేసిన ‘తండేల్’ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus