రెండు రోజుల్లో రెండు రకాలుగా పెళ్లి చేసుకోవడం కంటే ప్రత్యేకత ఏముంది? అది ఈ జంటకే సాధ్యమైంది. శుక్రవారం గోవాలో చైతూ-సమంత పెళ్లి ముందుగా హిందూ సంప్రదాయ ప్రకారం జరగబోతోంది. మధ్యాహ్నం 3 గం.లకు సంగీత్ మొదలవుతుంది. రాత్రి 11గం 52 నిమిషాలకు ఈ ప్రేమ జంట పెళ్లితో ఏకం కాబోతున్నారు. మరుసటి రోజు అంటే… శనివారం సాయింత్రం 5గం 30 నిమిషాలకు గోవా చర్చ్‌లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఉంగరాలు మార్చుకోబోతున్నారు. 8వ తేదీన గోవాలోనే భారీ స్థాయిలో వివాహ విందు ఇవ్వబోతోంది అక్కినేని కుటుంబం. ఈ విందుకు తెలుగు, తమిళ చిత్రసీమల నుంచి ప్రముఖులంతా పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గోవాలోని ‘డబ్ల్యూ’ హోటెల్ ప్రాంగణం సర్వాంగసుందరంగా ముస్తాబైంది.
సంగీత్, మెహందీ
శుక్రవారం మధ్యాహ్నం సంగీత్, మెహందీ కార్యక్రమాలు సందడిగా సాగింది. ఈ వేడుకలో చైతు మేనమామ, ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు, సమంత కలిసి డాన్స్ చేయడం విశేషం.
గోవా చేరుకున్న అతిథులు
చైతు-సామ్ పెళ్లి వేడుక కోసం ఇప్పటికే పలువురు అతిథులు గోవా చేరుకున్నారు. చైతు, సమంతలతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.