Naga Chaitanya, Sobhita Wedding Photos: ఘనంగా నాగ చైతన్య- శోభిత..ల పెళ్ళి… వైరల్ అవుతున్న ఫొటోలు!

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) , హీరోయిన్ శోభిత దూళిపాళ్ల  (Sobhita Dhulipala) ..ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. డిసెంబరు 4న ఈరోజు వారి పెళ్లి అని ముందుగానే ప్రకటించారు. ఇక పెళ్లి టైమ్ రానే వచ్చింది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో.. చైతన్య తాతగారు అక్కినేని నాగేశ్వరరావు  (Akkineni Nageswara Rao)   గారి విగ్రహం ముందు ఒక మండపాన్ని ఏర్పాటు చేసి అందులో చైతన్య- శోభిత .. ల పెళ్ళి జరిపారు. ఈ వేడుకకి అతి తక్కువ మంది సెలబ్రిటీలను ఆహ్వానించారు అక్కినేని నాగార్జున (Nagarjuna).

Naga Chaitanya, Sobhita Wedding Photos

చైతన్య- శోభిత .. లు మొదటి నుండీ తమ పెళ్లి వేడుకని ప్రైవేట్ గా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి.. నాగార్జున వారి నిర్ణయాన్ని గౌరవించారు అని స్పష్టమవుతోంది. ఇక శోభిత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి కాబట్టి, వారి సంప్రదాయంలో పెళ్లి చేయాలని శోభిత తల్లిదండ్రులు నాగార్జునని కోరారు. అందుకు కూడా నాగార్జున అంగీకరించారు అని తెలుస్తుంది.

ఇక చైతన్య, శోభిత .. ల పెళ్ళి వేడుకకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పెళ్ళి వస్త్రాల్లో నూతన వధూవరులు ఎంతో అందంగా , కళకళలాడుతూ కనిపిస్తున్నారు. అక్కినేని కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) .. ఈ వేడుకకు విచ్చేసి నూతన దంపతులు అయిన చైతన్య, శోభిత .. లని ఆశీర్వదించారు. ఇక చైతన్య, శోభిత .. ల పెళ్ళి ఫొటోలు మీరు కూడా ఒకసారి చూడండి:

1

2

3

4

బ్లాక్ బస్టర్ పాటపై తమన్నా అలా అనేసిందేంటి?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus