‘పుష్ప 2’ తో పాటు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన 8 సినిమాల లిస్ట్..!

ఒకప్పుడు వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమాల గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల (Movies) కాలంలో ఉన్నాం. పెద్ద సినిమాలకి కనుక టాక్ బాగుంటే వాటి లెక్క.. రూ.100 కోట్ల నుండి మొదలవుతుంది. ఆ తర్వాత వాటికి వెయ్యి కోట్లు అనేది కేక్ వాక్ అయిపోతుంది. ఇప్పుడు ఇండియన్ మూవీస్ లో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమాల  (Movies)  లిస్ట్..ను ఓ లుక్కేద్దాం రండి :

Movies

1) దంగల్ :

ఆమిర్ ఖాన్ (Aamir Khan) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ బాలీవుడ్ చిత్రానికి నితేష్ తివారీ (Nitesh Tiwari) దర్శకుడు. రూ.70 కోట్ల బడ్జెట్ తో ‘ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్’ ‘వాల్ట్ డిస్నీప్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థపై ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్ (Kiran Rao), సిద్ధార్థ్ రాయ్ కపూర్ (Siddharth Roy Kapur).. ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. కేవలం రూ.70 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ గా రూ.2050 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి ఇప్పటికీ నెంబర్ 1 ప్లేస్ లో కొనసాగుతుంది.

2) బాహుబలి 2 :

ప్రభాస్ (Prabhas) – రాజమౌళి (S. S. Rajamouli) – రానా (Rana Daggubati) కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రాన్ని ‘ఆర్కా మీడియా’ సంస్థపై శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda),ప్రసాద్ దేవినేని (Prasad Devineni)..లు సంయుక్తంగా నిర్మించారు. రూ.250 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1810 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

3) ఆర్.ఆర్.ఆర్ (RRR) :

ఎన్టీఆర్ (Jr NTR) -రాంచరణ్ (Ram Charan)- రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమాని ‘డీవీవీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై డీవీవీ దానయ్య (D. V. V. Danayya) రూ.550 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.1300 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

4) కేజీఎఫ్ (KGF) :

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై విజయ్ కిరంగధూర్ (Vijay Kiragandur) రూ.100 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1250 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

5) జవాన్ (Jawan) :

షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా అట్లీ (Atlee Kumar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై గౌరీ ఖాన్ (Gauri Khan),గౌరవ్ వెర్మ రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.1150 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

6) కల్కి 2898 ad (Kalki 2898 AD) :

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘వైజయంతి మూవీస్’ ‘స్వప్న సినిమా’ బ్యానర్లపై అశ్వినీదత్ (C. Aswani Dutt) ,ప్రియాంక దత్ (Priyanka Dutt), స్వప్న దత్ (Swapna Dutt)..లు కలిసి రూ.600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.1100 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

7) పటాన్ :

షారుఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand)  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ సంస్థ ఆదిత్య చోప్రా (Aditya Chopra) రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.1050 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

8) పుష్ప 2 :

అల్లు అర్జున్ (Allu Arjun) , దర్శకుడు సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో ‘పుష్ప’ కి (Pushpa) సీక్వెల్ గా ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)   వచ్చింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్..లు కలిసి ఈ చిత్రాన్ని రూ.450 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. 6 రోజులకే ఈ సినిమా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసింది.

9) బజరంగీ భాయ్ జాన్ :

సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా కబీర్ ఖాన్ (Kabir Khan) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.918 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసి కొద్దిలో వెయ్యి కోట్ల మార్క్ ను మిస్ అయ్యింది.

10) యానిమల్ (Animal) :

రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.917 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. కొద్దిలో ఇది కూడా వెయ్యి కోట్ల మార్క్ ను మిస్ అయ్యింది.

11) సీక్రెట్ సూపర్ స్టార్ :

జైరా వసీం, ఆమిర్ ఖాన్..లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ.15 కోట్ల బడ్జెట్లో రూపొంది వరల్డ్ వైడ్ గా రూ.905 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. కొద్దిలో వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ ను మిస్ అయ్యింది.

పుష్పరాజ్ గా పార్ట్ 2లో అల్లు అర్జున్ చెప్పిన బెస్ట్ డైలాగ్స్!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus