Allu Arjun: సంధ్య థియేటర్‌ ‘పుష్ప’ ప్రమాదం.. ఎలా జరిగింది? తప్పెవరిది?

హైదరాబాద్‌లో బెనిఫిట్‌ షోలకు ప్రభుత్వం ఆ మధ్య అనుమతులు ఇవ్వలేదు. క్రౌడ్‌ కంట్రోల్, ఇతర భద్రతా సమస్యల వల్లనే ఆ నిర్ణయం తీసుకున్నాం అని అప్పుడు చెప్పారు. అయితే అనూహ్యంగా ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2 The Rule) విషయంలో ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పోలీస్‌ గ్రౌండ్స్‌ ఇవ్వడం ఒకటి అయితే. ఇప్పుడు బెనిఫిట్‌ షోలకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో సంధ్య థియేటర్‌లో జరిగిన దుర్ఘటన జరిగింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Allu Arjun

సంధ్య థియేటర్‌లో ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2 The Rule) ప్రీమియర్స్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టికెట్‌ రేట్లు భారీగా పెట్టినా ప్రజల (అభిమానుల) నుండి భారీ స్పందనే వచ్చింది. అయితే సంధ్య థియేటర్‌లో ఓ అపశ్రుతి చోటు చేసుకుంది. సినిమా చూడటానికి తన ఇద్దరు పిల్లలతో ఓ మహిళ వచ్చారు. అయితే అక్కడకు అల్లు అర్జున్‌ (Allu Arjun) తన కుటుంబం, సన్నిహితులతో రావడంతో తొక్కిసలా జరిగింది. ఈ ఘటనలో ఆ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ క్రమంలో తప్పెవరిది, ఘటనకు బాధ్యులు ఎవరు అనే విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తొక్కిసలాట ఘటనపై సీరియస్ హైదరాబాద్ పోలీసులు అయ్యారు. బెనిఫిట్ షో సందర్భంగా వచ్చే క్రౌడ్‌ని దృష్టిలో పెట్టుకుని సరైన భద్రత చర్యలు తీసుకోలేదని థియేటర్‌ యాజమాన్యం, నిర్వాహకులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళ మృతి చెందిన ఘటనలో థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

‘పుష్ప 2’ ప్రీమియర్ చూడటానికి ధియేటర్‌కు అల్లు అర్జున్ (Allu Arjun) వచ్చిన సమయంలో అభిమానులు గేటు లోపలకు చొచ్చుకొచ్చారు. దీంతో తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీతేజ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి చెందగా, శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉంది. అల్లు అర్జున్ (Allu Arjun) వచ్చే సమయంపై పోలీసులకు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఇదంతా జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

అయితే, విషయం తెలిసినా సరైన భద్రత అందించలేదు అని నెటిజన్లు పోలీసు వ్యవస్థను విమర్శిస్తున్నారు. మరి దీనికి కారణమెవరు, ఇలాంటి విషయాల్లో ఇకపై ఏం చేయాలి అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి షోలకు చిన్న పిల్లలతో రావడంపై తల్లిదండ్రులు కూడా ఓసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పుష్ప 2 ది రూల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus