ప్రస్తుతం ఇండస్ట్రీలో స్ట్రాంగెస్ట్ బాండింగ్ ఎవరిది అని తెలుగు చిత్రసీమతో కాస్త పరిచయమున్న ఎవర్ని అడిగినా చెప్పే సమాధానం ఒక్కటే “నాగచైతన్య=సమంత”. వీళ్ళిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఇరు కుటుంబ పెద్దలను ఒప్పించి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ఇద్దరి ప్రేమను చూసి ముచ్చటపడని వారుండరు. అయితే.. నాగచైతన్య “ఏంమాయ చేసావే”లో సమంతని చూసి ఫ్లాట్ అయ్యే కంటే ముందు మరో అమ్మాయిని చూసి ఫిదా అయ్యాడట.
ఈ విషయాన్ని స్వయంగా నాగచైతన్య నిన్న జరిగిన “యుద్ధం శరణం” ఆడియో విడుదల వేడుకలో స్వయంగా వెల్లడించాడు. తన డైరెక్టర్ కృష్ణతో కలిసి ఒకే అమ్మాయికి లైన్ వేసేవాడట నాగచైతన్య. అయితే.. చివరికి ఆ అమ్మాయి నాగచైతన్యకే పడిందని కూడా డిక్లేర్ చేసేశాడు. ఈ విషయం సమంతకి ముందే తెలిస్తే ఒకే.. లేకపోతే ఇప్పుడు చైతూ అంతా ఎక్స్ ప్లైన్ చేసుకోవాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.