సమంత రివ్యూల్లో గెలిచింది.. నేను కలెక్షన్స్ లో గెలిచాను – అక్కినేని నాగచైతన్య

  • July 8, 2020 / 12:05 PM IST

“నా కెరీర్ లో ఇప్పటివరకూ నాతో హిట్ కొట్టిన ఏ ఒక్క డైరెక్టర్ కూడా ఇమ్మీడియట్ గా నాతో సినిమా చేయడానికి ఆసక్తి చూపలేదు. కానీ.. చందు మొండేటి మాత్రం “ప్రేమమ్” అనంతరం ఇమ్మీడియట్ గా మళ్ళీ నాతోనే సినిమా చేస్తానన్నాడు. అందుకు చందుకు నేను జీవితాంతం ఋణపడి ఉంటాను. “సవ్యసాచి” సినిమా కూడా నేను కేవలం చందు మీద నమ్మకంతో చేశాను” అంటూ తన మనోగతాన్ని మీడియాతో పంచుకొన్నాడు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటించిన “సవ్యసాచి” రేపు విడుదలవుతోంది.

ప్రేమమ్ షూట్ లో ఉన్నప్పుడూ ఈ పాయింట్ చెప్పాడు..
నార్వేలో “ప్రేమమ్” సాంగ్ షూట్ జరుగుతున్నప్పుడు చందు మొండేటి ఈ పాయింట్ చెప్పాడు. మొదట్లో ఇదేదో ఎక్స్ పెరిమెంటల్ ఫిలిమ్ గా మిగిలిపోతుందేమోనని భయపడ్డాను. కానీ.. కొన్నాళ్ళ తర్వాత చందు ఒక కమర్షియల్ సినిమాగా ఈ స్క్రిప్ట్ ను కన్వర్ట్ చేసి తీసుకొచ్చాడు. చాలా సంతోషపడ్డాను. అయితే.. మైత్రీ మూవీ మేకర్స్ రాకతో స్క్రిప్ట్ వేల్యూతోపాటు రేంజ్ కూడా పెరిగింది.

ఆ రిజల్ట్ డిజప్పాయింట్మెంట్ తోపాటు సంతోషాన్ని కూడా ఇచ్చింది..
“శైలజారెడ్డి” సినిమా విషయంలో కొన్ని తప్పులు జరిగాయి. నేను దర్శకుడు మారుతిని గుడ్డిగా నమ్మాను. క్లైమాక్స్ ఎక్కడో కాస్త తేడా కొట్టినా.. డైరెక్టర్ బిలీఫ్ మీద వెళ్లిపోయాను. అయితే.. ఆ సినిమా నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తీసుకురావడంతో సంతోషపడ్డాను కానీ.. ఎక్కువమందికి నచ్చలేదని మాత్రం డిజప్పాయింట్ అయ్యాను. అయితే.. ప్రతి సినిమా నుంచీ ఏదో ఒకటి నేర్చుకొంటాను కాబట్టి. ఇది కూడా ఒక పాఠం లాంటిదే.

ఆ రెండు సిండ్రోమ్ ల కలయిక..
ట్విన్ వానిషింగ్ సిండ్రోమ్ అంటే కవలలు ఒక బిడ్డగా రూపాంతరం చెందడం. ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్ అంటే ఎడమ చేయి మన ఆధీనంలో లేక దాని ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడం. ఈ రెండు సిండ్రోమ్ ల కలయికే “సవ్యసాచి” చిత్రం. ఈ రెండిటినీ బేస్ చేసుకొని ఫస్టాఫ్ & సెకండాఫ్ ను చాలా టెరిఫిక్ గా రాసుకొన్నాడు డైరెక్టర్ చందు. ఈ సినిమా నేను చేయడానికి ముఖ్య కారణం కూడా చందు సన్నివేశాలను రాసుకొన్న విధానమే.

నాన్నగారు కొన్ని మార్పులు చెప్పారు..
సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక నాన్నగారు సినిమా చూసి కొన్ని మార్పులు చెప్పారు. దాన్నిబట్టి కొన్ని సన్నివేశాలు యాడ్ చేయడమే కాక రీషూట్ లు కూడా చేశాం. రిజల్ట్ చాలా బెటర్ అనిపించింది. అయినా.. రీషూట్స్ ప్రతి సినిమాకి జరుగుతుంటుంది. ఈ సినిమాకి స్పెషల్ గా చేయలేదు కానీ.. నాన్నగారి ఇన్వాల్వ్ మెంట్ వల్ల కాస్త బెటర్ అవుట్ పుట్ వచ్చింది.

అర్జునుడిగా కనిపించేది స్కిట్ కోసమే..
ఈ సినిమాలో నేను పోషించే పాత్ర సవ్యసాచి కాబట్టి అర్జునుడిగా నటించలేదు. ఈ సినిమాలో ఒక చిన్న కామెడీ స్కిట్ ఉంది. ఆల్మోస్ట్ అందరు స్టార్ కమెడియన్స్ ఈ స్కిట్ లో ఉంటారు. ఒక సరదా సన్నివేశం కోసం చేసిన స్కిట్ అది. సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది.

మాధవన్ అప్పట్నుంచి అలాగే ఉన్నారు..
మాధవన్ గారి “సఖి” సినిమా విడుదలైనప్పుడు నేను స్కూల్లో చదువుకొంటున్నాను. అలాంటిది ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందం కలిగించిన విషయం. నా క్లాస్ మేట్స్ & ఫ్రెండ్స్ అమ్మాయిలందరూ ఫోన్ చేసి ఈరోజు షూటింగ్ కి రావోచ్చా? అని అడిగేవారు. అలాగే.. ఒక యాక్టర్ గా, ఫిలిమ్ మేకర్ గా ఆయన తీసుకోస్తున్న మార్పులు నాకు స్పూర్తినిస్తుంటాయి.

సమంతతో గొడవ పడుతూనే ఉంటాను..
నిజజీవితంలో ఇప్పటివరకు ఎప్పుడూ సమంతతో నేను గొడవపడలేదు. కానీ.. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “మజిలీ” (వర్కింగ్ టైటిల్) సినిమాలో మాత్రం గొడవపడుతూనే ఉంటున్నాను. ఇప్పటివరకు 18 రోజులు షూట్ చేశాం. సినిమాలో భార్యాభర్తలుగా నటిస్తున్నాం. మెచ్యూర్డ్ వైఫ్ & హజ్బెండ్ గా కనిపిస్తాం. ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది. సమ్మర్ లో రిలీజ్ కి ప్లానింగ్.

గెలుపెవరిది అనేది పాత్రికేయులే డిసైడ్ చేయాలి..
వినాయకచవితికి నేను-సమంత పోటీపడి మరీ మా సినిమాలు విడుదల చేశాం. నా సినిమా కలెక్షన్స్ సాధిస్తే, సమంత సినిమా రివ్యూల విషయంలో గెలిచింది. అయితే.. విన్నర్ ఎవరన్నది మాత్రం మీరే (జర్నలిస్టులు) డిసైడ్ చేయాలి. ఆ వారం రోజులు మాత్రం ఇంట్లో హైటెన్షన్ వాతావరణం ఉండేది. ఇంకెప్పుడూ అలాంటి సిచ్యుయేషన్ రాకూడదని కోరుకొంటున్నాను.

పెళ్లి నన్ను మనిషిగా చాలా మార్చింది..
పెళ్లికి ముందు నా మనసులో ఏదో తెలియని వెలితి ఉండేది. పెళ్లి తర్వాత ఆ గ్యాప్ ఫిల్ అయిన ఫీలింగ్. ఏదో సంతృప్తి. అందుకే సమంతను నా బెస్ట్ పార్ట్నర్ అంటాను. మా వర్క్ వల్ల మా రిలేషన్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటాం. వీలైనంతవరకూ సండే వర్క్ లేకుండా చూసుకొని ఇంట్లోనే కలిసి గడపడానికి ఇష్టపడతాను. ప్రస్తుతానికైతే.. ఇద్దరం కలిసి ఒక సినిమా చేస్తున్నాం.. ఆ తర్వాత సినిమా ఏమిటనేది ఇంకా క్లారిటీ లేదు. త్వరలోనే ప్రకటిస్తాను.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus