ప్రెజంట్ జనరేషన్ యూత్ దగ్గర డబ్బుల్లేవు అంటే నమ్మోచ్చేమో కానీ.. చేతిలో స్మార్ట్ ఫోన్ లేదు అంటే మాత్రం నమ్మడం చాలా కష్టం. మామూలు కుర్రాళ్ళ విషయంలోనే నమ్మశక్యం కాని మేటర్ ని యంగ్ హీరో విషయంలో ఎలా నమ్ముతాం చెప్పండి. కానీ.. శౌర్య, శర్వానంద్ లు నిజంగానే స్మార్ట్ ఫోన్స్ కి చాలా దూరంగా ఉంటూ వచ్చారు. శర్వానంద్ ఇప్పటికీ ఒక బేసిక్ ఫోన్ ను వాడుతుండగా.. శౌర్య మాత్రం కనీసం తనకంటూ ఒక సొంత మొబైల్ లేకుండానే ఇప్పటివరకూ నెట్టుకొచ్చేశాడు. అయితే.. ఉన్నట్లుండి అప్డేట్ అయ్యాడు నాగశౌర్య. “ఛలో, నర్తనశాల” సినిమా ప్రమోషన్స్ టైమ్ లో నేను అసలు ఫోన్ వాడను, వాడాలనే ఆశ కూడా లేదు అంటూ తన గురించి చెప్పుకొచ్చిన శౌర్య ఉన్నట్లుండి ఇవాళ ఉదయం నేను కూడా స్మార్ట్ వరల్డ్ లోకి వచ్చేశా అంటూ పోస్ట్ పెట్టాడు.
అయితే.. శౌర్య అప్డేట్ అవ్వడానికి వెనుక ఉన్న అసలు కారణం “@నర్తనశాల” రిజల్ట్ అని ఫిలిమ్ నగర్ టాక్. కథ-కథనం విషయంలో సరిగా అప్డేట్ అవ్వకపోవడం వలన ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని ఆల్మోస్ట్ అందరూ అనుకొన్నారు. దాంతో అప్డేట్ అవ్వడం మొదలెట్టాడు శౌర్య. ముందుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం కోసం సామ్ సంగ్ నోట్ 9 ఫోన్ కొనుక్కొన్నాడు. అయితే.. ఇది ప్రమోషన్ లో ఒక భాగామా లేక నిజంగానే అప్డేట్ అయ్యాడా అనేది తెలియాల్సి ఉంది.