వరుస పరాజయాల కారణంగా వెనక్కి తగ్గిన నిర్మాతలు

  • February 26, 2020 / 03:59 PM IST

“అశ్వథ్థామ” చిత్రంతో రచయితగా మారిన నాగశౌర్య.. పూర్తి స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు. కంటెంట్ & మేకింగ్ బాగున్నప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం “అశ్వథ్థామ” ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే.. శౌర్య ఆ విషయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ ఫెయిల్యూర్స్ మాత్రం మనోడిని వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవలే రెండు సినిమాలు మొదలెట్టిన శౌర్య హీరోగా గత ఏడాది శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఎనౌన్స్ చేయబడిన సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది.

నాగశౌర్య కెరీర్ ట్రాక్ రికార్డ్ మరియు ఈమధ్య వచ్చిన వరుస పరాజయాల కారణంగానే నిర్మాతలు వెనక్కి తగ్గారని సమాచారం. ఆల్రెడీ షూట్ చేసిన కొద్దిపాటి సినిమాను కేర్ చేయడం లేదట. సినిమా తాము అంచనా వేసినడానికంటే ఓవర్ బడ్జెట్ అవుతోందని, అందుకే నిర్మాతలు తప్పుకొన్నారని తెలుస్తోంది. మరి ఈ ప్రొజెక్ట్ ను శౌర్య తన సొంత బ్యానర్ లో టేకప్ చేస్తాడో లేక లైట్ తీసుకుంటాడో చూడాలి.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus