నందినీ రెడ్డి సినిమాలో జంటగా నటించనున్న నాగ‌శౌర్య, సమంత

యువ నటుడు నాగశౌర్య “ఊహ‌లు గుస‌గుస‌లాడే” సినిమాతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత దిక్కులు చూడకు రామయ్య, జోఅచ్యుతానంద‌ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నారు. సొంత బ్యానర్లో చేసిన “ఛ‌లో” సినిమాతో సూపర్ హిట్ ని కైవశం చేసుకున్నారు. అయితే ఆ చిత్రం త‌ర్వాత వ‌చ్చిన మూడు సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. మంచి కాన్సెప్ట్స్ తో వచ్చిన “క‌ణం”, “అమ్మ‌మ్మ‌గారిల్లు”, “@న‌ర్త‌న‌శాల‌” సినిమాలు ఎంటర్టైన్మెంట్ చేయలేకపోయాయి. ప్ర‌స్తుతం నాగ‌శౌర్య… నందినీ రెడ్డి దర్శకత్వంలో నటించడానికి ఒకే చెప్పినట్లు తెలిసింది.

2014లో వచ్చిన కొరియన్ మూవీ “మిస్ గ్రానీ” స్పూర్తితో ఈ కథ రాసుకున్నట్లు టాక్. అతీత శక్తులను కలిగి యువతిగా మారిపోయే వృద్ధురాలి పాత్ర చుట్టూ కథ సాగుతుంది. ఆ పాత్రని మెచ్చిన సమంత వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర నాగ‌శౌర్య‌కు ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది. వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న తనని ఈ మూవీ హిట్ ట్రాక్ లోకి తీసుకొస్తుందని నమ్మకంతో ఒప్పుకున్నట్లు టాక్. భ‌వ్య క్రియేష‌న్స్ సంస్థ నిర్మించనున్న ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus