హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో మెద‌టి షెడ్యూల్ ని పూర్తిచేసుకున్న నాగ‌శౌర్య

ఛ‌లో లాంటి చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో వ‌స్తున్న చిత్రం ఇటీవ‌లే షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో మెదటి షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది.. జూన్ లో రెండ‌వ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. ఈ చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మెద‌టి షెడ్యూల్ అవుట్ పుట్ చాలా బాగా రావ‌టం, ద‌ర్శ‌కుడు క‌మిట్‌మెంట్ యూనిట్ లో అంద‌రికి ఆనందాన్ని క‌లిగించింది. చిత్ర స‌మ‌ర్ప‌కుడు శంక‌ర్ ప్ర‌సాద్ చాలా ద‌గ్గ‌రుండి అన్ని తానై ప్రోడ‌క్ష‌న్ చూసుకుంటున్నారు. లైన్ ప్రోడ్యూస‌ర్ బుజ్జి యూనిట్ లో అంద‌రికి ఏ ఇబ్బంది లేకుండా ఎండ‌లు ముండుతున్నాకూడా ఎండ దెబ్బ త‌గ‌ల‌కుండా యూనిట్ మెత్తాన్ని ఫ్యామిలి లా చూసుకున్నారు. నిర్మాత ఉషాముల్పూరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ద‌ర్శ‌కుడి విజ‌న్ ని ఏ లోకెష‌న్ కావాలంటే ఆ లొకేష‌న్ ఇచ్చి రిచ్ గా వుండేలా నిర్మాణ భాద్య‌త‌లు చూసుకుంటున్నారు. ఈ చిత్రంలో నాగ‌శౌర్య కి జంట‌గా మెహరీన్ నటిస్తుంది. హైద‌రాబాద్ లోని ఓక కాలెని లో, ప‌బ్ లో ఇలా చ‌క్క‌టి లోకేష‌న్స్ ఎంచుకుని మెద‌టి షెడ్యూల్ ని విజ‌య‌వంతంగా పూర్తిచేశారు.

నిర్మాత‌లు మాట్లాడుతూ.. ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని చాలా నిజాయితిగా నిర్మించాము. అంతే నిజాయితిగా అఖండ విజ‌యం అందించారు మా బ్యాన‌ర్ లో చిత్రాలు అన్ని ప్రేక్ష‌కుడు ని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తాము… ఛ‌లో మంచి ప్రేమ‌క‌థ‌, న‌ర్త‌న‌శాల మంచి కామెడి చిత్రం గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. అదే విధంగా నాగ‌శౌర్య న‌టించే ప్రోడ‌క్ష‌న్ నెం 3 చిత్రం షూటింగ్ మెద‌టి షెడ్యూల్ పూర్త‌యింది. హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చేశాము. నాగ‌శౌర్య రాసిన క‌థ‌కి ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ‌తేజ ప్రాణం పోస్తున్నాడు. కెమెరామెన్ మనోజ్ రెడ్డి ప్ర‌తి ఫ్రేమ్ ని చాలా అందంగా అర్థ‌వంతంగా షూట్ చేస్తున్నాడు. మెహ‌రిన్ హీరోయిన్ గా మ‌రోక్క‌సారి ప్రేక్ష‌కుల అభిమానాన్ని పొందుతుంది. త‌దుప‌రి షెడ్యూల్ ని జూన్ లో చేస్తాము. అని అన్నారు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus