నాగవంశీని అడిగితే.. నేను ఎవరినీ ఏమీ అనను. కానీ అందరూ నన్నే అంటుంటారు అని అంటారు. ఇదే మాట ఇతరుల్ని అడిగితే.. మేమేమీ కావాలని ఆయన్న అనం. ఆయనే ఏదో మాట అని విషయం రేపితే.. ఆ తర్వాత అది డ్రాగ్ అవుతుంది అని అంటుంటారు. ఇందులో ఎవరు నిజం.. ఎవరు కాదు అనేది మనం నిర్ణయించలేం. అయితే లేటెస్ట్‌గా నాగవంశీ మరో టాపిక్‌ను రెయిజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు వచ్చే రిప్లైలకు, చర్చలకు ఆయనే కారణం అని చెప్పొచ్చు.
Naga Vamsi
కార్తి హీరోగా, పీఎస్ మిత్రన్ తెరకెక్కించిన చిత్రం ‘సర్దార్ 2’. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆయన మట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేదికపైకి వచ్చిన నాగవంశీని మీరు ఒకవేళ స్పై చేస్తే ఎవరి మీద చేస్తారని యాంకర్ అడగ్గా.. ఆయన ‘‘మేం సినిమా వాళ్లం కదా.. హీరోయిన్లను ఎప్పుడైనా డేట్స్ అడిగితే బిజీగా ఉన్నాం.. రాలేమని చెబుతారు. నిజానికి వీళ్లు ఏం బిజీగా ఉన్నారో కనుక్కోవాలని ఉంది అని అన్నారు.
అక్కడితో ఆగకుండా హీరో, దర్శకుల కంటే హీరోయిన్లు ఏం బిజీగా ఉంటారో తెలుసుకోవాలని ఉంది. నిజంగా అంత బిజీగా ఉంటారా? మనకి తెలియని బిజీ ఏంటి అని అనిపిస్తుందని వంశీ చెప్పారు. దీంతో వంశీ రీసెంట్‌గా చేసిన సినిమాలేంటి? రానని చెప్పిన హీరోయిన్లు ఎవరు అనే చర్చ మొదలైంది. లేక ఇప్పుడు చేస్తున్న హీరోయిన్లు ఎవరైనా ఇలా చెప్పారా అనేది ఇక్కడ ప్రశ్న.
మీ ఎదురుగా ఉన్న ఇద్దరు హీరోయిన్లు ఎవరైనా అలా చెప్పారా అని యాంకర్ అడిగితే.. ఈ జీబ్రా కాస్ట్యూమ్ అమ్మాయి (ఆషికా రంగనాథ్) నా నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ అని చెప్పారు నాగవంశీ. మాళవిక మోహనన్‌తో అయితే ఇంకా పనిచేయలేదన్నారు. నాగవంశీ ఒకేసారి చాలా సినిమాలు సెట్స్ మీద పెడుతుంటారు. మరి ఆ సినిమాల్లో ఏ హీరోయిన్ ఇలా అన్నారో ఆయనే చెప్పాలి.