‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగవంశీ(Naga Vamsi) ఏం మాట్లాడినా సంచలనమే. ఈ సంక్రాంతికి అతని సినిమా ‘అనగనగా ఒక రాజు’ రిలీజ్ అయ్యింది. భారీ పోటీలో ఈ సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే సోషల్ మీడియాలో కొంతమంది ఈ సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో నాగవంశీకి కోపం వచ్చింది. ఈరోజు ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో దానిని బయటపెట్టేశాడు.
నాగవంశీ మాట్లాడుతూ… “6 ఏళ్ళ తర్వాత నేను సంతృప్తి చెందిన సంక్రాంతి ఇది. గతేడాది కూడా హిట్ ఇచ్చాము(డాకు మహారాజ్).కాకపోతే అది టెక్నికల్ గా నెక్స్ట్ లెవెల్లో ఉన్నా… డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అంతగా లాభపడలేదు. ఈసారి మాత్రం ‘అల వైకుంఠపురములో’ తర్వాత ఆ రేంజ్ సంతృప్తినిచ్చింది ‘అనగనగా ఒక రాజు’ చిత్రం. అదేంటో.. ఈసారి మీడియా కూడా నా సినిమా బాగా ఆడాలని గట్టిగా కోరుకున్నారు. నా తోటి నిర్మాతలు కూడా నేను పెద్ద హిట్టు కొట్టాలని భావించారు.
అయితే 72 గంటల నుండి ఫ్యాన్ బాయ్స్ మాత్రం ఒక్కటే విధంగా డ్యూటీ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఫ్యాన్ బాయ్స్ అంటే నా ఫ్యాన్ బాయ్స్ కాదు. ఎవరి ఫ్యాన్ బాయ్సో మీ అందరికీ తెలుసు. మీ అందరికీ చాలా థాంక్స్. ఇంకో 10 రోజులు ఇలాగే డ్యూటీ చేసి మా రెవెన్యూస్ పెంచండి. మీకు రిటర్న్ గిఫ్ట్ ఏ రేంజ్లో ఇస్తాను అనేది త్వరలోనే వెల్లడిస్తాను. మరోవైపు నేను మిడ్ రేంజ్ సినిమాతో వస్తున్నప్పటికీ నాకు పెద్ద సినిమాలతో సమానంగా స్క్రీన్స్ ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్లు. అందరికీ థాంక్స్. సంక్రాంతికి హిట్టు కొట్టాలి అనేది ఇగో మేటర్.
ఈ టైంలో హిట్టు కొట్టడమనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. 2 సార్లు మిస్ ఫైర్ అయ్యింది. ఈసారి నవీన్ సపోర్ట్ తో కొట్టాను. మీనాక్షి చౌదరి ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత నవీన్ సరిగ్గా డేట్స్ ఇవ్వడేమో అని భయపడి ఆమెను హోల్డ్ చేశాను. నాకు ఏడాది వరకు సినిమా లేదు అని తినేసేది. ఆమె కోసమైనా హిట్టవ్వాలని కోరుకున్నాం” అంటూ చెప్పుకొచ్చారు.