Nagarjuna: షారుఖ్ తర్వాత నాగార్జున.. ఆస్తి విలువ మెగాస్టార్ కంటే ఎక్కువే..

సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకటే చర్చ. ఇండియాలో అత్యంత ధనవంతుడైన హీరో ఎవరు? దీనిపై తాజాగా వచ్చిన ఒక నివేదిక ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా సంపద విషయంలో బాలీవుడ్ హీరోలదే హవా అనుకుంటాం. కానీ ఈసారి మన టాలీవుడ్ హీరోలు ఆ లిస్టులో గట్టి పోటీనే ఇచ్చారు. ముఖ్యంగా కింగ్ నాగార్జున స్థానం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ లిస్టులో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ రూ. 12,931 కోట్లతో టాప్ ప్లేస్ లో ఉంటే, ఆయన తర్వాత స్థానంలో నాగార్జున నిలవడం విశేషం.

Nagarjuna

లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం నాగార్జున ఆస్తుల విలువ దాదాపు రూ. 5000 కోట్లు అని అంచనా వేస్తున్నారు. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి బడా స్టార్స్ ను వెనక్కి నెట్టి నాగ్ రెండో ప్లేస్ కొట్టేయడం మామూలు విషయం కాదు. సల్మాన్ ఖాన్ 3 వేల కోట్లతో మూడో స్థానంలో ఉంటే, ఆ తర్వాత హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ ఉన్నారు. ఇక మన మెగాస్టార్ చిరంజీవి రూ. 1750 కోట్లతో ఏడో స్థానంలో నిలిచారు. వెంకటేష్, రామ్ చరణ్ కూడా టాప్ 10 లో చోటు దక్కించుకుని టాలీవుడ్ స్టామినా ఏంటో చూపించారు.

అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. గతంలో ఫోర్బ్స్ లాంటి సంస్థలు ఇలాంటి లిస్టులు విడుదల చేసినప్పుడు నాగార్జున వాటిని సీరియస్ గా ఖండించారు. సెలబ్రిటీల ఆస్తుల గురించి బయట జరిగే ప్రచారంలో నిజం ఉండదని, అవన్నీ తప్పుడు లెక్కలని ఆయన తేల్చి చెప్పారు. అప్పులు, ఇతర ఖర్చులు లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఆస్తులు మాత్రమే చూపిస్తారని ఆయన అప్పట్లో కామెంట్ చేశారు.

కానీ ఫ్యాన్స్ మాత్రం నాగ్ రేంజ్ కి ఇది కరెక్ట్ ఫిగర్ అని భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు. అన్నపూర్ణ స్టూడియోస్, ఫిల్మ్ స్కూల్, రియల్ ఎస్టేట్ ఇలా చాలా వ్యాపారాలు ఉన్నాయి. వీటికి తోడు బిగ్ బాస్ హోస్టింగ్, సినిమాలు ఉండనే ఉన్నాయి. కాబట్టి 5 వేల కోట్లు అనేది పెద్ద ఆశ్చర్యం కాదని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ వైరల్ న్యూస్ పై నాగ్ ఈసారైనా స్పందిస్తారో లేక ఎప్పటిలాగే సైలెంట్ గా ఉంటారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus