మల్టీ స్టారర్ సినిమాలో తనరోల్ చెప్పిన నాగార్జున

అక్కినేని నాగార్జున తన కెరీర్ లో ఇన్నో హిట్స్.. ప్లాప్స్ చూసారు. వాటి ప్రభావం తర్వాత సినిమాపై పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా సాగుతున్నారు. నాగ్ గత చిత్రం ఆఫీసర్ ఘోర పరాజయం పాలయింది. అయినా ఫలితాన్ని పక్కన పెట్టి విజయం కోసం ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ప్రస్తుతం డైరక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నానితో కలిసి ఓ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన కాలనీ సెట్ లో సాగుతోంది.ఈ చిత్రంలో నాగ్ సరసన కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్, నానికి జోడిగా రష్మిక కనిపించనున్నారు. అయితే ఈ సినిమా గురించి అనేక రూమర్లు చక్కర్లు కొట్టాయి.

రోజురోజుకి అవి పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదు. అందుకే నాగ్ స్పందించారు. ఇందులో తనతో పాటు నాని రోల్స్ ఏంటో చెప్పారు. “ఇందులో నేను గ్యాంగస్టర్‌గా నటిస్తున్నా. నాని నాకు వైద్యం చేసే డాక్టర్‌ పాత్ర పోషిస్తున్నాడు. ఇది చాలా సరదాగా సాగిపోయే స్క్రిప్ట్‌. శ్రీరామ్‌ ఆదిత్య ప్రత్యేకత ఇందులో కనపడుతుంది” అని స్పష్టం చేశారు. ఇంకా మాట్లాడుతూ.. ” మల్టీస్టారర్‌ కథలతో చిత్రాలు చేయడం సంతోషంగా ఉంది. “ఊపిరి”లో కార్తితో పనిచేయడం భలే సరదా అనిపించింది. నానితో కూడా అలాగే ఉంది.’’ అంటూ నవ్వుతూ చెప్పారు. ఇక నుంచి అయినా ఈ చిత్రంపై గాసిప్స్ ఆగుతాయేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus