ఒక పక్క ‘మన్మధుడు’ మరో పక్క ‘సోగ్గాడు’ సీక్వెల్స్ తో నాగ్

గత కొంత కాలంగా నాగార్జున కి సరైన హిట్టు లేదనే చెప్పాలి. ‘ఓం నమో వెంకటేశాయ’ ‘ఆఫీసర్’ ‘దేవదాస్’ వంటి చిత్రాలు నాగార్జునకు నిరాశనే మిగిల్చాయి. మధ్యలో వచ్చిన ‘రాజు గారి గది 2’ పరవాలేధనిపించినా… యావరేజ్ గా మాత్రమే నిలిచింది. ఈ క్రమంలో హిట్టు కొట్టేందుకు నాగ్ ఒక కొత్త ప్లాన్ వేసుకున్నాడట. నాగ్ కెరియర్లో సూపర్ హిట్లుగా నిలిచిన ‘మన్మధుడు’ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రాలకు సీక్వెల్స్ లో నటించేందుకు నాగ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ‘మన్మధుడు’ సీక్వెల్ ను ‘మన్మధుడు 2’ పేరుతో రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్ కు సంబందించిన వార్త కూడా ఒకటి బయటకొచ్చింది.

నాగ్ కెరీర్లోనే మంచి కలెక్షన్స్ రాబట్టిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. 2016 సంక్రాంతి కానుకగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం దాదాపు 47 కోట్ల షేర్ ను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్ గా రాబోతోన్న చిత్రానికి ‘బంగార్రాజు’ అనే టైటిల్ ను ఎప్పుడో ప్రకటించేశాడు నాగార్జున. కల్యాణ్ కృష్ణ చెప్పిన కథకు చాలా మార్పులు చెప్పి ఫైనల్ గా నాగార్జున ఓకే చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో కూడా ‘బంగార్రాజు’ సరసన రమ్యకృష్ణను ఖరారు చేశారట. ఇక ఈ చిత్రంలో చైతూ కూడా నటించబోతున్నాడని టాక్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికార ప్రకటన చేయనున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus