పవన్ కళ్యాణ్ ని అనుసరిస్తున్న నాగార్జున
- May 13, 2017 / 06:36 AM ISTByFilmy Focus
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన “ఓం నమో వెంకటేశాయ”తో పాటు గెస్ట్ రోల్ చేసిన నిర్మల కాన్వెంట్ నిరాశపరిచాయి. అందుకే ఈ సారిఎలాగైనా హిట్ కొట్టాలని శ్రమిస్తున్నారు. ప్రస్తుతం నాగ్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న రాజు గారి గది 2 లో కీలక పాత్రలో నటిస్తున్నారు. తొలిసారి హారర్ మూవీ చేస్తున్న నాగార్జున, ఇందులో ఆయన రోల్ కూడా విభిన్నంగా ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ టెక్నిక్ ని ఫాలో అవుతున్నట్లు తెలిసింది. అది ఏమిటంటే.. గోపాల్ గోపాలా సినిమాలో పవన్ లేటుగా ఎంట్రీ ఇస్తాడు. అక్కడి నుంచి కథ ఊపందుకుంటుంది.
అదే విధంగా నాగార్జున రాజు గారి గది 2 లో ఆలస్యంగా ఎంట్రీ ఇస్తారంట. నాగ్ వచ్చినప్పటి నుంచి నవ్వుల జోరు అందుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. ఇక క్లైమాక్స్ లో నాగార్జున నటన, టైమింగ్ అద్భుతం అని వెల్లడించారు. నాగార్జున ఇంట్రవెల్ ట్విస్ట్ కూడా అదిరిపోతుందని చెప్పారు. ఇలా పవన్ కళ్యాణ్ టెక్నిక్ తో సూపర్ హిట్ కొట్టడానికి నాగార్జున సిద్ధమయిపోయారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















