బిగ్ బాస్ హౌస్ లో శని ఆదివారాలు హౌస్ట్ నాగార్జున తనదైన స్టైల్లో ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాడు. శనివారం హౌస్ మేట్స్ ని చెడుగుడు ఆడిస్తే, ఆదివారం వారితో ఆటపాటా అంటూ అద్దరగొట్టేస్తాడు. ఇందులో భాగంగా ఆదివారం నాగార్జున ఎపిసోడ్ దుమ్ములేచిపోయింది. ఒకవైపు నాగచైతన్య, సమంత ఇద్దరూ విడాకులు తీస్కున్నారని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసినా కూడా ఆ బాధ అనేది ఇంత కూడా ముఖంలో చూపించకుండా నవ్వతూ తనదైన స్టైల్లో యాంకరింగ్ చేశాడు.
స్టేజ్ పైకి నాగార్జున రాగానే హౌస్ మేట్స్ సర్ ప్రైజ్ అంటూ నిన్నేపెళ్లాడతా సినిమాలో సాంగ్స్ ని డ్యాన్స్ చేశారు. నిన్నేపెళ్లాడతా సినిమా వచ్చి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో హౌస్ మేట్స్ ఈ స్పెషల్ సర్ ప్రైజ్ ని నాగార్జునకి ప్లాన్ చేసి మరీ ఇచ్చారు. ఈ సినిమాని తలచుకుంటూ కాసేపు భావోద్వేగానికి గురి అయ్యాడు నాగార్జున. అప్పుడే 25యేళ్లు గడిచిపోయినాయ్ అంటే నమ్మశక్యంగా లేదని, మీరు పెర్ఫామెన్స్ ఇస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయంటూ హౌస్ మేట్స్ తో చెప్పాడు. ఇందులో ప్రతి పాట సూపర్ హిట్టే అని, అది మీరు చేస్తుంటే నాకళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయంటూ చెప్పాడు.
ఇక హౌస్ మేట్స్ తో ఆట-పాట ప్రారంభించిన నాగార్జున ఎలిమినేషన్స్ లో భాగంగా నటరాజ్ మాస్టర్ ని ఎలిమినేట్ చేశారు. అంతేకాదు, హౌస్ మేట్స్ ని ఏ జంతువుతో పోలుస్తారో చెప్పమని నటరాజ్ మాస్టర్ ని అడిగారు. దీంతో నటరాజ్ మాస్టర్ వివిధ జంతువులని హౌస్ మేట్స్ కి ఇచ్చారు. ఇక హౌస్ లో గుంటనక్క ఫైనల్ గా రవినే అని కన్ఫార్మ్ చేశారు మాస్టర్.