అక్కినేని హీరో నాగార్జునకు మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. నాగార్జున కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి సందేహాలు నెలకొనడంతో అభిమానులు ఒకింత టెన్షన్ పడుతున్నారు. అయితే తాజాగా లగ్జరీ కారును కొనుగోలు చేయడం ద్వారా నాగార్జున వార్తల్లో నిలిచారు. కియా ఈవీ6 కారును నాగార్జున కొనుగోలు చేయడం గమనార్హం. వయస్సు పెరుగుతున్నా అందంగా కనిపిస్తున్న నాగార్జున కొత్త కారును కొనుగోలును చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ కారులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కారు ఖరీదు 60 నుంచి 70 లక్షల రూపాయలు అని సమాచారం. ఈ కారుకు అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారని నాలుగున్నర నిమిషాలు ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చని సమాచారం. డ్రైవర్ సీటును 10 రకాలుగా అడ్జెస్ట్ చేసుకోవచ్చని బోగట్టా. ఈ కారు ద్వారా 528 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణం చేయొచ్చని తెలుస్తోంది. నాగార్జున కొత్త కారును కొనుగోలు చేయడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నాగ్ అజయ్ భూపతి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. నాగార్జున రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. సినిమా సినిమాకు నాగార్జున రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. నాగార్జున మల్టీస్టారర్ సినిమాలలో నటించాలని ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అక్కినేని నాగార్జున (Nagarjuna) కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అక్కినేని నాగార్జున కొడుకుల కెరీర్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.