Nagarjuna: నాగార్జునకు మాత్రమే సొంతమైన అరుదైన రికార్డ్ ఇదే!

  • August 30, 2022 / 12:48 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో వివాదాలకు దూరంగా ఉండే హీరోగా నాగార్జునకు పేరుంది. ఇతర హీరోలకు ఎంతో గౌరవం ఇచ్చే నాగార్జున కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉంటారు. ఎక్కువ మొత్తం డిమాండ్ చేసే అవకాశం ఉన్నా పరిమితంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ నాగార్జున కెరీర్ ను కొనసాగిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్6 కు నాగార్జున ఏకంగా 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని బోగట్టా. నాగార్జున నటించిన బ్రహ్మాస్త్రం, ది ఘోస్ట్ సినిమాలు నెల రోజుల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానున్నాయి.

ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధిస్తే నాగార్జున రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. నాగార్జున త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. ఈ ప్రపంచంలో ఏ హీరోకు లేని అరుదైన రికార్డ్ నాగ్ ఖాతాలో చేరింది. నాగార్జున కెరీర్ లో మరపురాని సినిమాలలో మనం సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, అమల, సమంత నటించారు.

ఇలా కుటుంబమంతా ఒకే సినిమాలో నటించిన అరుదైన రికార్డ్ నాగ్ కు మాత్రమే సొంతమంది. అదే సమయంలో నాగార్జున అటు తండ్రి ఏఎన్నార్ కు జోడీగా నటించిన హీరోయిన్లలో కొందరితో ఇటు కొడుకు చైతన్యకు జోడీగా నటించిన హీరోయిన్లలో కొందరితో కలిసి నటించారు. ఈ విధంగా నాగార్జున అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు. అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై ప్రేక్షకులను మెప్పించిన అతికొద్ది మంది హీరోలలో నాగార్జున ఒకరు.

ఈ జనరేషన్ స్టార్ హీరోలు సైతం నాగార్జునను ఎంతగానో ఇష్టపడతారు. సినిమాలతో నాగార్జున ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వ్యాపారవేత్తగా కూడా నాగ్ సత్తా చాటారు. నాగార్జున కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నాగ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus