కింగ్ అక్కినేని నాగార్జునకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ్ రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది. ఒక్కో సినిమాకు నాగ్ 12 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ధనుష్, నాగ్ కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
అయితే ఈ సినిమా తర్వాత నాగ్ ఒక యాక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నవీన్ అనే తమిళ డైరెక్టర్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారని తెలుస్తోంది. నాగ్ ఈ మధ్య కాలంలో నటించిన యాక్షన్ సినిమాలన్నీ ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయనే సంగతి తెలిసిందే. ఆఫీసర్, ఘోస్ట్ సినిమాలు ఏ రేంజ్ లో నష్టాలను మిగిల్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ్ మళ్లీ అలాంటి రిస్క్ చేయడం ఫ్యాన్స్ కు సైతం నచ్చడం లేదు.
కెరీర్ విషయంలో నాగ్ జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని పాన్ ఇండియా రేంజ్ లో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫ్యామిలీ జానర్ సినిమాలు నాగార్జునకు ఎక్కువగా విజయాలను అందిస్తున్న నేపథ్యంలో ఆ తరహా కథలకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుందని చెప్పవచ్చు. మరోవైపు తమిళ డైరెక్టర్లు తెలుగు హీరోలతో చేసిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.
నాగార్జున (Nagarjuna) నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుంటుందని మరి కొందరు చెబుతున్నారు. ఇతర భాషల్లో సైతం నాగార్జున మంచి గుర్తింపును కలిగి ఉండగా క్రేజీ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే నాగ్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగార్జునను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కెరీర్ విషయంలో నాగ్ ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.