బిగ్ బాస్ ఇంట్లో వారం మొత్తం జరిగే డ్రామా ఒక వంతు… వీకెండ్ లో నాగార్జున వచ్చి ఆ వారం జరిగిన విషయాల్ని పోస్ట్ మార్టం చెయ్యడం ఇంకో వంతు. రెండో వారంలో నాగార్జున ఒకసారి ఇంటి సభ్యుల మీద ఆగ్రహం వ్యక్తం చేసాడు. అయితే ఆ సారి ఆటలో సీరియస్ నెస్ లేదని. మళ్ళీ ఈ వారం నాగ్ ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు. ఏకంగా ఒక కొరడా తీసుకొచ్చాడు. ఇంటిలోని ఆడపిల్ల మీద అరిస్తే కొరడా జులిపిస్తా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇంతకీ ఏమైందంటే?
ఈ వారం నామినేషన్ సమయంలో అఖిల్, అభిజిత్ మధ్య గొడవ అయిన విషయం మీకు తెలిసిందే. వేలు చూపించి మాట్లాడే విషయంలో మొదలైన చర్చలోకి హఠాత్తుగా మోనల్ వచ్చేసింది. ఆ విషయాన్ని నాగ్ ఈ రోజు లేవనెత్తాడు. అసలు ఆమె పేరు మీ చర్చ్ లో ఎందుకు వచ్చింది అంటూ కడిగిపారేశాడు. ఆమె పేరు చర్చలోకి తీసుకొచ్చిన అఖిల్, అభిజిత్ మీద ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఆ తరవాత నాయల్ టాపిక్ చర్చకు వచ్చింది. స్వాతి కోసం మాస్టర్ ని ఎలా నామినేట్ చేస్తావ్ అంటూ ప్రశ్నించాడు.
ఎవరన్నా మాటలాడుతుంటే అమ్మ రాజశేఖర్ వినరు అనే విషయం మనకు తెలిసిందే. మొన్న నామినేషన్ టైం లో అరియానా తో ఇలానే చేసాడు. ఈ రోజు ఆ విషయాన్ని నాగ్ మాస్టర్ కు చేసి చూపించాడు. తరవాత డోస్ యంగ్రీ యాంగ్ మాన్ కి తగిలింది. అమ్మాయిల మీద ఆ లెవెల్ లో కోపంతో అరుస్తావా అంటూ నాగ్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఇంకోసారి ఇంట్లో ఆడపిల్ల మీద నోరు లేస్తే కొరడా దెబ్బలే అని వార్నింగ్ ఇచ్చాడు. మరి దీనికి ఇంటి సభ్యుల రెస్పాన్స్ ఏంటో రాత్రి చూద్దాం.