అప్పుడు ఛీ అన్నాడు.. భారీ రెమ్యూనరేషన్ కోసం బిగ్ బాస్ అయ్యాడు

మాటలు మార్చడంలో మన రాజకీయనాయకులు సిద్ధహస్తులనే విషయం అందరికీ తెలిసిందే. కానీ.. ఆ మాట మార్చడంలో రాజకీయ నాయకులను మించిన మహానటులమని మన ఇండస్ట్రీ హీరోలు కూడా పలుమార్లు ప్రూవ్ చేశారనుకోండి. తాజాగా ఆ జాబితాలోకి జాయిన్ అయిన వ్యక్తి మన నాగార్జున. ముక్కుసూటిగా మాట్లాడడంలో నాగార్జున ఎప్పుడు ముందుంటారు. అందుకే.. ‘దేవదాసు” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అప్పుడు నాని & బిగ్ బాస్ ఇష్యూ గురించి ఆయన్ని అడిగినప్పుడు చాలా స్ట్రయిట్ గా “నన్ను బిగ్ బాస్ గురించి అడగకండి.. నాకు ఆశల బిగ్ బాస్ కాన్సెప్ట్ నచ్చలేదు. అవతలి మనిషి ఏం చేస్తున్నాడో చూడడం అనేది నాకు అస్సలు నచ్చదు” అని చెప్పేశాడు నాగార్జున.

కానీ.. అదే నాగార్జునను ఇప్పుడు సడన్ గా “నేనే వస్తున్నా” అంటూ “బిగ్ బాస్ 3” ప్రోమోల్లో కనిపించేసరికి షాక్ అయ్యారు జనాలు. తొలుత అసలు నాగార్జున ఈ మూడో సీజన్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నాడా అనుకున్నారు కానీ.. బిగ్ బాస్ టీం ఆయనకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందించారని తెలిసేసరికి.. నాగార్జున నిజంగా బిజినెస్ మ్యాన్ అనుకోని సైలెంట్ అయిపోయారు. కానీ.. ఈ స్థాయిలో ఆస్తులు, స్టార్ డమ్, హోదా సంపాదించుకొన్న తర్వాత కూడా నాగార్జున ఇలా తన మాట మీద నిలబడక డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వడం అనేది హాస్యాస్పదంగా మారింది. ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ షో గురించి చీప్ గా మాట్లాడిన వీడియో బిగ్ బాస్ 3 ప్రోమో కలిపి మీమ్ పేజస్ లో తెగ ఆడుకొంటున్నారు. మరి నాగార్జున వీటికి ఎలా స్పందిస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus