అక్కినేని నాగార్జున (Nagarjuna) చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) వివాహం నిన్న అంటే జూన్ 6న కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రేయసి జైనబ్ రవ్జీని అఖిల్ … జూబ్లీహిల్స్‌లోని ఉన్న నాగార్జున ఇంట్లో పెళ్లి చేసుకోవడం జరిగింది.మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , రామ్ చరణ్ (Ram Charan) వంటి స్టార్లను నాగార్జున ఆహ్వానించారు.మిగిలిన వారిని జూన్ 8న నిర్వహించబోయే రిసెప్షన్ కి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో కూడా నాగార్జున బిజీగా గడుపుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఓ పక్క కొడుకు పెళ్లి హడావిడిలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తన వర్క్ లైఫ్ ను మాత్రం నాగార్జున పక్కన పెట్టలేదు. ఈ షార్ట్ గ్యాప్ లో తన సినిమాల పనులు కూడా చక్కబెట్టేస్తున్నాడు నాగ్. విషయంలోకి వెళితే.. నాగార్జున ప్రస్తుతం ‘కుబేర’(Kubera) ‘కూలి’ (Coolie) వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ముందుగా కుబేర సినిమా జూన్ 20న విడుదల కానుంది. ఈ క్రమంలో తన పార్ట్ డబ్బింగ్ ను ఫినిష్ చేశారట నాగార్జున.
అఖిల్ పెళ్లి, రిసెప్షన్ హడావిడి ఉన్నప్పటికీ నాగార్జున.. స్పీడ్ గా ‘కుబేర’ డబ్బింగ్ వర్క్ కంప్లీట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో ధనుష్ తో (Dhanush) కలిసి నటిస్తున్నారు నాగార్జున. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వం వహిస్తున్న ‘కుబేర’ లో నాగార్జున పాత్ర కూడా హీరోకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అంచనాలు కూడా పెరిగాయి.