టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోత్కర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ఈమె ఘట్టమనేని కోడలిగా ఒదిగిపోయింది. మహేష్ కి అన్ని విషయాల్లో అండగా ఉంటోంది. గౌతమ్, సితారలకు మంచి తల్లిగా పేరుతెచ్చుకుంది. నమ్రత అంటే తనకి ఎంత ఇష్టమో ఆమె పుట్టినరోజున మహేష్ ట్వీట్ చేశారు. “నా జీవితానికి వెలుగు నమ్రత, తనే నా బలం అంటూ పోస్ట్ చేసి ప్రేమను వ్యక్తపరిచారు. అదే విధంగా నమ్రత రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో మహేష్ అంటే ఎంత ప్రేమో చెప్పింది. “కుటుంబం కోసం మహేష్ ఏదైనా చేస్తాడు.
తల్లిదండ్రుల్ని అమితంగా ప్రేమించే బిడ్డగా, మహేష్ ఈజ్ ఏ గ్రేట్ సన్. అంతకు మించి పిల్లల్ని ప్రేమించే గొప్ప తండ్రి. జీవిత భాగస్వామికోసం అన్నిటా తోడుగా నిలిచే భర్త. గౌతమ్ పుట్టిన కొన్నాళ్లకు మా అమ్మ నాన్న చనిపోతే “ఖలేజా” షూటింగ్ కి కొన్ని రోజులు విరామం తీసుకొని నాకు అండగా నిలిచారు. అందుకే మహేష్ అంటే అంత ప్రేమ, ఆరాధన. మహేష్ ని కలవడం నా జీవితంలో నాకు దక్కిన పెద్ద అదృష్టం” అని నమ్రత వివరించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.