Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి
- October 8, 2026 / 10:08 AM ISTByPhani Kumar
ఇండియన్ సినిమా గర్వించదగ్గ విలక్షణ నటుడు నానా పటేకర్ (Nana Patekar) . ఆయన మరణవార్తతో ఈరోజు ప్రారంభం అవ్వడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. అవును నిజమే.. నానా పటేకర్ కన్నుమూశారు. ఆయన వయసు 75 ఏళ్లు. ఈరోజు అనగా గురువారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కన్నుమూసినట్టు తెలుస్తోంది. గోవాలో ఉన్న ఆయన నివాసంలో నానా పటేకర్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో, కుటుంబ సభ్యులు వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తరలించారు.
Nana Patekar

కానీ అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారట. 45 నిమిషాల పాటు సీపీఆర్ (CPR) చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని వైద్యులు చెప్పారట.దీంతో నానా పటేకర్ మరణంపై పోలీసులు మెడికో లీగల్ కేసు నమోదు చేసి, ఆయన బాడీని పోస్టుమార్టంకి పంపారట. రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని వారు చెప్పినట్టు సమాచారం. 1951లో జన్మించిన నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్ అని చాలా మందికి తెలిసుండకపోవచ్చు.
1978లో ‘గమన్’ అనే సినిమాతో ద్వారా నటుడిగా మారారు. హిందీ, మరాఠీ భాషల్లో కలుపుకుని ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు. 1989లో వచ్చిన ‘పరిందా’ సినిమాతో ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆయనకి 2013లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అదే ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్ కపూర్ ప్రత్యేక సహకార అవార్డును కూడా అందుకున్నారు నానా పటేకర్.
నానా పటేకర్ పై 2018 లో మీటూ ఆరోపణలు కూడా వచ్చాయి. వాటి వల్ల పలు పెద్ద సినిమాల్లో ఆయన అవకాశాలు కోల్పోయారు. అయినప్పటికీ ఒక ఆర్టిస్ట్ గా ఆయన గొప్పతనాన్ని దర్శక నిర్మాతలు పలుమార్లు స్పష్టంగా వివరించడం జరిగింది. షూటింగ్ స్పాట్లో చెప్పిన టైమ్ కి ఉండటం , అలాగే ఎటువంటి పాత్రకైనా జీవం పోసేందుకు ఆయన ఎన్నో గంటలు పనిచేస్తారని, ముక్కుసూటి మనిషి అని మేకర్స్ చెప్పడం జరిగింది.













