నందమూరి తారకరత్న ‘సారథి` ఫ‌స్ట్‌లుక్ మోష‌న్‌పోస్ట‌ర్‌కి సూప‌ర్ రెస్పాన్స్‌!

నందమూరి తారకరత్న హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సారథి’. జాకట రమేష్ దర్శకత్వంలో పంచభూత క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన టైటిల్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా విజ‌యద‌శ‌మి సంద‌ర్భంగా సార‌థి ఫ‌స్ట్‌లుక్ మోష‌న్‌పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర‌యూనిట్‌. ఈ సంద‌ర్భంగా..దర్శకుడు జాకట రమేష్ మాట్లాడుతూ.. ”ఇటీవ‌ల అనౌన్స్ చేసిన పంచభూత క్రియేషన్స్ బేన‌ర్ లోగోకి, మా బేన‌ర్‌లో నిర్మిస్తున్న `సార‌థి` టైటిల్‌కి మంచి అప్రిసియేష‌న్ వ‌చ్చింది. ఈ సినిమా నుండి విజ‌య‌ద‌శమి కానుక‌గా నంద‌మూరి తార‌క‌ర‌త్న ఫస్ట్‌లుక్, మోష‌న్ పోస్ట‌ర్‌ విడుద‌ల‌చేయ‌డం జ‌రిగింది.

ద‌స‌రాకి ఎంతో కాంపిటేష‌న్ ఉన్న‌ప్పటికి మా సార‌థి సినిమా ఫ‌స్ట్‌లుక్ మోష‌న్‌పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. స్నేహితులు, స‌న్నిహితులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. కరోనా సమయంలో కూడా నంద‌మూరి తారక రత్నగారు ఎంతో సాహసంతో షెడ్యూల్ ను పూర్తి చేసి మాకు సహకరించారు. ఆయనకి మా చిత్ర బృందం ఎప్ప‌టికీ ఋణ పడి ఉంటుంది. గ‌తంలో మా సినిమాకి ప్రొడ్యూస‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్ స‌పోర్ట్ చేశారు. ఈ సినిమాకి కూడా వాళ్ల ద‌గ్గ‌ర‌నుండి మంచి స‌పోర్ట్ ల‌భిస్తోంది. మంచి కంటెంట్ ఉంటే ఇండ‌స్ట్రీ ఎప్పుడూ స‌పోర్ట్ చేస్తుంద‌ని ర‌థేరా త‌ర్వాత మా సార‌థి సినిమాతో మ‌రోసారి ప్రూవ్ అయింది. త్వ‌ర‌లో ట్రైల‌ర్ విడుద‌ల‌చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus