Akhanda 2: బోయపాటి – బాలయ్య మీద అతిపెద్ద బాధ్యత.. టాలీవుడ్‌ మీద ముద్ర చెరపాల్సిందే!

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా అంటే అభిమానులు, ప్రేక్షకుల్లో మినిమమ్‌ ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఇద్దరూ కలసిన గత మూడు పర్యాయాలు అలాంటి విజయాలు అందుకున్నారు మరి. తాజాగా నాలుగోసారి ఈ కాంబినేషన్‌ అలరించడానికి సిద్ధమైంది. #BB4 అంటూ ఈ సినిమాను అనౌన్స్‌ చేసిన టీమ్‌.. ఈ రోజు స్టార్ట్‌ చేసేసింది కూడా. బాలకృష్ణ – బాబీ సినిమా షూటింగ్‌ తుది దశకు వచ్చిన నేపథ్యంలో ఎప్పటిలాగేనే కొత్త సినిమాగా ఈ ప్రాజెక్ట్‌కు కొబ్బరికాయ కొట్టారు.

Akhanda 2

109వ సినిమాకు గుమ్మడికాయ కొట్టాక ఈ సినిమాలోకి పూర్తి స్థాయిలో వస్తారు. ఈ నేపథ్యంలో సినిమా మీద ఏర్పడిన అంచనాలను మీట్‌ అవ్వడమే కాకుండా.. ఇండస్ట్రీలోని ఓ బ్యాడ్‌ సెంటిమెంట్‌ను కూడా బ్రేక్‌ చేయాల్సిన అవరం కూడా ఉంది. అదే సీక్వెల్స్‌కు విజయాలు కరవు అనే సెంటిమెంట్‌. అదేంటి.. తెలుగులో సీక్వెల్స్‌ ఇటీవల కాలంలో మంచి విజయాలు అందుకుంటున్నాయి కదా అనొచ్చు.

అయితే సీక్వెల్స్‌ ఉందని సినిమా ఆఖరులో చెప్పినవి, తొలుత నుండి రెండు భాగాలు అని చెప్పి తీసిన సినిమాలు మాత్రమే విజయాలు అందుకున్నాయి. సినిమా ఫలితం చూశాక రెండో భాగం తీసిన సినిమాలకు ఆశించిన ఫలితం ఇప్పటివరకు రాలేదు. దీంతో ‘అఖండ 2’ (Akhanda 2) విజయం అ బ్యాడ్‌ సెంటిమెంట్‌ను తుడిచేయకతప్పదు. ఇంకా డౌట్‌ ఉంటే ‘మనీ మనీ’, ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’, ‘ఆర్య 2’ అంటూ అప్పటి సినిమాలు.. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ అంటూ లేటెస్ట్‌ సినిమాలను గుర్తు చేసుకుంటే సరి.

ఆ సినిమాల (Akhanda 2) ఫలితాలు ఎంత ఇబ్బంది పెట్టాయో మీకు తెలిసే ఉంటుంది. సో ఆల్‌ ది బెస్ట్‌ టు బాలయ్య అండ్‌ బోయపాటి. అలాగే నిర్మాతగా రెండో సినిమా ప్రకటన చేసి.. తొలుత ప్రారంభిస్తున్న నందమూరి బాలయ్య రెండో తనయ తేజస్వినికి కూడా ఆల్‌ ది బెస్ట్‌. దైవత్వం, దేవాలయాల ప్రాభవం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం.

షూటింగ్ ఎప్పుడో చెప్పారు సరే.. ఇంతకీ హీరో ఎవరు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus