Balakrishna: ఆ బ్లాక్ బస్టర్ సినిమాను బాలయ్య నిజంగానే రిజెక్ట్ చేశారా?

  • April 29, 2024 / 10:15 PM IST

సాధారణంగా మెగా, నందమూరి హీరోలు కలిసి నటిస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం అవుతుందని ఆర్.ఆర్.ఆర్ (RRR) సినిమాతో ఇప్పటికే ప్రూవ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1200 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. రాజమౌళి (S. S. Rajamouli) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఎంతో కష్టపడి పని చేశారు. అయితే ఈ సినిమా కంటే ముందే మెగా, నందమూరి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉందట.

అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ కాంబినేషన్ లో సినిమా రాలేదు. గోపాల గోపాల (Gopala Gopala) సినిమాను బాలయ్య (Nandamuri Balakrishna), పవన్ (Pawan Kalyan)కాంబినేషన్ లో తెరకెక్కించాలని దర్శకుడు భావించారట. అయితే బాలయ్య సినిమా కథ విని ఆ పాత్ర తనకు సూట్ కాదని నా ఇమేజ్ కు ఆ రోల్ సెట్ కాదని చెప్పారట. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి పవన్ లేదా బాలయ్య స్పందిస్తే మాత్రమే క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.

బాలయ్య, పవన్ కళ్యాణ్ మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే. పొలిటికల్ గా బాలయ్య, పవన్ కళ్యాణ్ పార్టీలు కలిసి పని చేస్తున్నాయి. భవిష్యత్తులో బాలయ్య, పవన్ కళ్యాణ్ కలిసి నటించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. అటు బాలయ్య, ఇటు పవన్ క్రేజ్ పరంగా ఒకింత టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. బాలయ్య, పవన్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

బాలయ్య , పవన్ ప్రస్తుతం పొలిటికల్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. బాలయ్య బాబీ (K. S. Ravindra) సినిమాతో బిజీగా ఉండగా పవన్ కళ్యాణ్ పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం గమనార్హం. బాలయ్య, పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమాలలో నటించి పాన్ ఇండియా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య, పవన్ కళ్యాణ్ లకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus