Kalyan Ram: హీరో కళ్యాణ్ రామ్ లో ఉన్న గొప్ప లక్షణాలు ఏంటో తెలుసా?

టాలీవుడ్ హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ కు ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉండగా అమిగోస్ సినిమాతో కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అమిగోస్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం గమనార్హం. అమిగోస్ సినిమా కోసం క్లాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో మెమరబుల్ మూవీగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే కళ్యాణ్ రామ్ కు అచ్చొస్తున్నాయని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పటాస్, బింబిసార సినిమాలలో కొన్ని సన్నివేశాల్లో కళ్యాణ్ రామ్ రోల్ నెగిటివ్ షేడ్స్ లో ఉంటుంది. ఈ సినిమాలు కమర్షియల్ గా కూడా విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు కళ్యాణ్ రామ్ లో కొన్ని గొప్ప లక్షణాలు కూడా ఉన్నాయి. కుటుంబానికి కళ్యాణ్ రామ్ ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.

అదే సమయంలో రిస్కీ ప్రాజెక్ట్ లను సొంత బ్యానర్ లోనే నిర్మించేలా కళ్యాణ్ రామ్ ప్లాన్ చేసుకుంటారు. ఈ విధంగా చేయడం ద్వారా తన సినిమాలపై నష్టాల భారం పడకుండా కళ్యాణ్ రామ్ జాగ్రత్త పడుతున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. తన సినిమాల బడ్జెట్ల విషయంలో కళ్యాణ్ రామ్ రాజీ పడరు. సినిమాకు అవసరమైతే మార్కెట్ ను మించి ఖర్చు చేయడానికి కళ్యాణ్ రామ్ వెనుకాడరు.

రాబోయే రోజుల్లో కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కళ్యాణ్ రామ్ లో ఉన్న గొప్ప లక్షణాలకు సాధారణ ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారు. కళ్యాణ్ రామ్ భిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తుండటం గమనార్హం.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus