సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో ముచ్చటగా ఐదో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
వెంకీ, అనిల్ రావిపూడితో పాటు నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. డైరెక్టర్‌తో తమ బ్యానర్‌కు ఇది హ్యాట్రిక్ సినిమా అని నిర్మాణ సంస్థ ‘షైన్ స్క్రీన్స్’ ప్రకటించింది.
ప్రస్తుతం వర్కింగ్ టైటిల్‌గా ‘VenkyAnil5’ అలాగే ‘NKRAR2’ అని పిలుచుకుంటున్న ఈ మూవీ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నటిస్తున్న కళ్యాణ్ రామ్ పారితోషికం గురించే ఆ చర్చ అంతా. వరుస ఫ్లాపులతో ఉన్న కళ్యాణ్ రామ్‌కు ఈ మల్టీస్టారర్ రూపంలో మంచి ఆఫర్ దక్కింది. ఈ ప్రాజెక్ట్‌లో సెకండ్ లీడ్‌గా నటించేందుకు అతడికి రూ.7.5 కోట్లు పారితోషికంగా ఇస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్.
నిజానికి కళ్యాణ్ రామ్ సోలో హీరోగా చేస్తే అతడి మార్కెట్ కనీసం రూ.20 కోట్ల వరకు ఉంటుంది. కానీ ఈ మధ్య అతడు నటించిన ‘అమిగోస్’ ‘డెవిల్’ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ప్రస్తుత మార్కెట్‌ను బట్టే ఈ పారితోషికం ఫిక్స్ చేసినట్లు సమాచారం.
వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌కు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ ట్రాక్ రికార్డ్ ఉంది. ‘F2’ ‘F3’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేశాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో మాజీ IPS ఆఫీసర్ వైడీ రాజుగా వెంకీ నటన, యాక్షన్ అందరినీ ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఇటీవల వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో కూడా వెంకీ స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చి మెప్పించాడు.
మరోవైపు విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ (AK47) అనే మరో భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.