Mokshagna: మోక్షజ్ఞ ఇలా స్లిమ్ అవ్వడానికి అదే కారణమా?

  • June 13, 2023 / 01:02 AM IST

నందమూరి నట సింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ అధిక శరీర బరువు ఉండటంతో ముందు తాను సన్నబడి అనంతరం నటనలో శిక్షణ తీసుకున్న తర్వాత హీరోగా ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ కొన్ని సంవత్సరాల నుంచి వార్తలు సృష్టిస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ లేకపోవడంతో నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై ఆశలు కూడా వదులుకున్నారు అన్న తరుణంలో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

త్వరలోనే ఈయన సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది అయితే ఈయన నటించే మొదటి సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదల కాబోతుందని పరోక్షంగా తెలియజేశారు. ఇకపోతే మోక్షజ్ఞ లుక్ ఇదివరకు అభిమానులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఈయన ట్విట్టర్ వేదికగా తన న్యూ లుక్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోలు చూసిన అభిమానులు మోక్షజ్ఞ(Mokshagna) హీరోగా పర్ఫెక్ట్ గా ఉన్నారు అంటూ సంతోషం వ్యక్తం చేశారు.అయితే మోక్షజ్ఞ బరువు తగ్గడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తున్నారు. మోక్షజ్ఞ బరువు తగ్గడానికి కారణం ఏమిటి అనే విషయం గురించి ఆలోచిస్తూ చాలా మంది ఈయన కూడా ఎన్టీఆర్ మాదిరిగానే సర్జరీ చేయించకున్నారనీ భావిస్తున్నారు.

ఎన్టీఆర్ కూడా రాఖీ సినిమా తరువాత ఇలా సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ మాదిరిగానే మోక్షజ్ఞ కూడా సర్జరీ చేయించుకుని తనని ఫాలో అయ్యారని తెలుస్తుంది.మోక్షజ్ఞ ఎలా బరువు తగ్గినా కూడా చూడటానికి చాలా అందంగా ఉన్నారంటూ అభిమానులు భావిస్తున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus