నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshagnya) డెబ్యూ మూవీ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకి ఈ ఏడాది జవాబు దొరికినట్టు అయ్యింది. ‘హనుమాన్’ తో (Hanuman) పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగిన ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూకి రంగం సిద్ధమైంది. వాస్తవానికి గత నెలలోనే రామకృష్ణ స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అనుకున్నారు. కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఫైనల్ నెరేషన్ పెండింగ్లో ఉండటంతో అనౌన్స్మెంట్ తోనే ఆపేశారు.
మరి పూజా కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహిస్తారు? రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రశాంత్ వర్మ ఈరోజు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. పీవీసీయుని మరోసారి గుర్తు చేస్తూ ఆయన ట్వీట్ ఉంది. మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ చేయబోయే సినిమా కూడా పీవీసీయు(ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) లో భాగంగానే విషయాన్ని ఆ ట్వీట్ తో ప్రశాంత్ వర్మ గుర్తుచేశాడు.
ఇక రెగ్యులర్ షూటింగ్ గురించి క్లారిటీ అయితే అతను ఇచ్చింది లేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. డిసెంబర్ 2న మోక్షజ్ఞ డెబ్యూ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించే ఛాన్స్ ఉంది. హీరోయిన్ గా రవీనాటాండన్ కుమార్తె రషా తథానీ దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తుంది.
ఇక విలన్ పాత్ర కోసం రానాని సంప్రదించారట. కానీ రానా (Rana) డేట్స్ ఇప్పుడు ఖాళీ లేనందున వేరే నటుడి కోసం సంప్రదిస్తున్నట్టు సమాచారం.బాలకృష్ణ సైతం ఓ ముఖ్యపాత్రలో కనిపించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చాలా రోజుల నుండి నడుస్తున్న టాక్