కన్నడ సీమకు సూపర్ స్టార్ వారసుడి సినిమా

  • October 25, 2016 / 10:16 AM IST

సూపర్ స్టార్ కృష్ణ – విజయనిర్మల వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇటీవల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు నరేష్ తనయుడు నవీన్ విజయ కృష్ణ. నవీన్ నటించిన ‘నందిని నర్సింగ్ హోమ్’ ఈ నెల 21న విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది. నటుడిగా నవీన్ కి, దర్శకుడిగా పీవీ గిరికి తొలి విజయాన్ని అందించిన ఈ సినిమా ఇప్పుడు కన్నడ చిత్రసీమకు పయనమవనుందట.

ఒక భాషలో విజయం సాధించిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ కావడం ఈరోజుల్లో సర్వ సాధారణ విషయం. అయితే సాధారణంగా బడా హీరోల సినిమాలే ఎక్కువగా ఇతర భాషల్లోకి వెళుతుంటాయి. అలాంటిది నవీన్ నటించిన తొలి సినిమానే కన్నడలో రీమేక్ అవుతుండటం విశేషం. ఈ విషయాన్ని దర్శకుడు గిరి స్వయంగా వెల్లడించారు. తొలి ప్రయత్నంలోనే విజయం వరించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన పీవీ గిరి తన తర్వాతి సినిమాల గురించి చెబుతూ ‘నందిని..’ చిత్ర నిర్మాతలతోనే మరో సినిమా చేయాల్సి ఉందని దీంతోపాటు ప్రముఖ నిర్మాణ సంస్థయిన పీవీపీ వారి నుండి పిలుపు వచ్చిందన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus