నందిని నర్సింగ్ హోమ్

  • October 21, 2016 / 09:19 AM IST

సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా పరిచయమవుతున్న తొలి చిత్రం ‘నందిని నర్సింగ్ హోమ్’. ‘ఇక్కడ అంతా క్షేమం’ అనేది ట్యాగ్ లైన్. లవ్, రొమాంటిక్, కామెడి ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని, U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. పీవీ గిరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎస్‌.వి.సి.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రాధాకిషోర్‌.జి, బిక్షమయ్య సంగం సంయుక్తంగా నిర్మించారు. నిత్యా నరేష్, శ్రావ్య హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ‘నందిని నర్సింగ్ హోమ్’ ఎలా వుందో ఒకసారి చూద్దామా!

కథ : వైజాగ్ లోని ఓ బ్యాంకులో రికవరీ బాయ్ గా పనిచేస్తుంటాడు చందు(నవీన్ విజయ కృష్ణ). అమూల్య (శ్రావ్య) అనే అమ్మాయితో చందు ప్రేమలో పడతాడు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోతారు. చందు ఉద్యోగం కూడా పోతుంది. దీంతో చందుకి ప్రేమపై నమ్మకం పోతుంది. అయితే నకిలీ సర్టిఫికెట్లు చూపించి నందిని నర్సింగ్‌ హోమ్‌లో డాక్టర్ గా ఉద్యోగం సంపాదిస్తాడు చందు. నందిని నర్సింగ్‌ హోమ్‌ అధిపతి కూతురు నందిని(నిత్యా నరేష్) చందు ప్రవర్తన నచ్చి ప్రేమలో పడుతుంది. అయితే అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. అసలు అమూల్య-చందులు ఎందుకు విడిపోయారు? వీరిద్దరి మధ్య ఏం జరిగింది? నందిని నర్సింగ్‌ హోమ్‌లో చందుకి ఎలా ఎంటర్ అయ్యాడు? నందిని నర్సింగ్‌ హోమ్‌లో చందు చేరిన తర్వాత ఏం జరిగింది? అక్కడ చందుకు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? చివరకు చందు ఎవరి సొంతం అయ్యాడు? అనే అంశాలు వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పనితీరు : ఇప్పటివరకు పలు సినిమాలకు ఎడిటర్ గా పనిచేసి, అందరి ప్రశంసలు అందుకున్న నవీన్ విజయ్ కృష్ణ ‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నవీన్ కు ఇది తొలి చిత్రం అయినప్పటికీ నటుడిగా మంచి మార్కులు కొట్టేసాడు. యాక్టింగ్, డాన్స్, యాక్షన్ సీన్లలో చక్కగా నటించాడు. ముఖ్యంగా నవీన్ డైలాగ్ డెలివరీ బాగుంది. లవ్, రొమాంటిక్ సీన్లలో బాగా చేశాడు. ఇక హీరోయిన్లు నిత్యా నరేష్, శ్రావ్యలు వారి వారి పాత్రలతో ఆకట్టుకున్నారు. ఇద్దరూ కూడా గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా మంచి మార్కులే తెచ్చుకున్నారు. ఇక నవీన్ స్నేహితుడుగా నటించిన షకలక శంకర్ మరోసారి తన కామెడి టైమింగ్ తో అదరగొట్టేసాడు. వెన్నెల కిషోర్, సప్తగిరి, జయప్రకాశ్ రెడ్డిల కామెడి బాగుంది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేశారు. సినిమా అంతా కూడా లవ్, రొమాంటిక్, థ్రిల్లింగ్ కామెడి ఎంటర్ టైనర్ గా కొనసాగుతోంది. కానీ అక్కడక్కడ కాస్త వేగం తగ్గినట్లుగా అనిపిస్తోంది. మొత్తానికి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా అని చెప్పుకోవచ్చు.

సాంకేతికవర్గం పనితీరు : దర్శకుడు పి.వి.గిరి సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇలాంటి కథతో ఇప్పటికీ చాలా సినిమాలు వచ్చినప్పటికీ కథనం విషయంలో బాగా కేర్ తీసుకొని చిత్రీకరించారు. లవ్, కామెడి ఎంటర్ టైనర్ లో థ్రిల్లింగ్ అంశాలను జోడించి, హార్రర్ ఎఫ్ఫెక్ట్ తో బాగా చూపించారు. అయితే పలు చోట్ల లాజిక్స్ మిస్ అయినట్లుగా అనిపిస్తోంది. అందరూ నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్ దాశరథి శివేంద్ర పనితీరు బాగుంది. అందమైన లోకేషన్లలో చిత్రీకరించారు. విజువల్స్ పరంగా చాలా నీట్ గా, కలర్ ఫుల్ గా చూపించారు. అచ్చు సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ పనితీరు బాగుంది. చివరగా నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ : ‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కుటుంబ సమేతంగా వెళ్లి చూడదగ్గ చిత్రం. ఎలాంటి అసభ్యకర సీన్లు, ద్వంద అర్థాలు వచ్చే బూతు మాటలు లేకుండా రూపొందింది. చూస్తున్నంతసేపు హాయిగా నవ్విస్తోంది.

రేటింగ్ : 2.25/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus