నాని విల్లా విలువెంతో తెలుసా ?
- June 10, 2017 / 10:15 AM ISTByFilmy Focus
తెలుగు యువ హీరోలు సరైన కథలను ఎంచుకొని హిట్లను అందుకోవడమే కాదు.. వ్యక్తిగత జీవితాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుంటున్నారు. హిట్లు ఉన్నప్పుడే సొంత ఇళ్లను కొనుక్కుంటున్నారు. కొన్ని రోజుల క్రితం రాజ్ తరుణ్ కూడా 2 కోట్లతో ఒక విల్లా కొన్నాడు. ఒకే ప్రొడ్యూసర్ లో మూడు సినిమాల డీల్ కుదుర్చుకుని ఈ విల్లా కొన్నాడని తెలిసింది. అదే విధంగా పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ కూడా వరుస సినిమాలను సైన్ చేసి బంజారా హిల్స్ లో ఒక సొంతిల్లు కొనుక్కున్నాడు. ఇక హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని కూడా ఓ ఇంటివాడు అయ్యాడు.
గచ్చిబౌలి ఏరియాలో ఏకంగా 5 కోట్లు పెట్టి అందమైన విల్లాను కొనుక్కున్నాడు. ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ వారు క్రియేట్ చేసిన ఒక లగ్జరీ వెంచర్ లో భాగమైన ఈ విల్లాను.. నాని ఎప్పుడో రిజిస్టర్ చేయించారు. రీసెంట్ గా పూర్తి అయి నాని చేతికి వచ్చింది. మార్చిలో నానికి కొడుకు పుట్టాడు. జూనియర్ నాని తో కలిసి ఈ కొత్త ఇంట్లోకి త్వరలోనే నాని, అంజనా అడుగు పెట్టనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













