నాచురల్ స్టార్ నాని దసరా సినిమా తర్వాత తిరిగి హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి ఈ సినిమాలో నాని సరసన నటి మృణాల్ నటించారు. ఈ సినిమా తండ్రీ కూతురు మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది. ఇలా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి టీజర్ లాంచ్ చేయగా ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు చిత్ర బృందం సమాధానాలు చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ నాని గత సినిమాల కలెక్షన్స్ గురించి ప్రశ్నించారు. మీరు నటించిన జెర్సీ శ్యామ్ సింగరాయ్ సినిమాల వల్ల నిర్మాతలు భారీగా నష్టపోయారని ఈ సినిమాలకు అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాలేదు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇది ఎంతవరకు నిజం అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ ఈ మాట నిర్మాతలను చెప్పమనండి అంటూ కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఈ మాట మీకు ఏ నిర్మాత చెప్పారో చెప్పండి అయినా గత సినిమాల కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన వేదిక కాదు. ఆ సినిమాలు థియేటర్ నా థియేటర్ , రేమేక్ అంటూ అన్ని సినిమాలు భారీగానే కలెక్షన్స్ రాబట్టాయని పది రూపాయలు పెట్టుబడి పెడితే 50 రూపాయల వరకు లాభం వచ్చిందని
ఈ సందర్భంగా నాని (Nani) గత సినిమాలో కలెక్షన్స్ గురించి కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో తెలిసి తెలియని వారు ఇలాంటి మాటలు మాట్లాడవచ్చు కానీ అన్నీ తెలిసినటువంటి మీడియా రీజనింగ్ తో అడ్రస్ చేయాలి ఇలా సినిమాల గురించి వచ్చినటువంటి నిజం కాదు అని తెలిసినప్పుడు ఆ విషయాన్ని అందరికీ తెలియజేస్తే బాధ్యత కూడా మీదే అంటూ మీడియా పై ఈయన కాస్త అసహనం వ్యక్తం చేశారు.